అమ్మయ్య.. హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ సమస్య తీరిపోనుందా..!

భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారి ట్రాఫిక్ సమస్య ప్రభుత్వానికి ఇటు ప్రజలకు పెద్ద సవాల్ విసిరుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సరికొత్త ఐడియాకు శ్రీకారం చుట్టారు.

నరకం అంటే ఏందో హైదరాబాద్ మహానగర వాసులు భారీ వర్షం వచ్చిన ప్రతిసారీ ప్రత్యక్షంగా చూస్తారు..! అది వరద నీరు స్తంభించడం కావచ్చు, ట్రాఫిక్ జామ్‌లో గంటలపాటు చిక్కుకుపోవడం కావచ్చు..! ఇది ప్రధాన జంక్షన్లలో ప్రతిసారి జరుగుతున్న తంతు. ఈ సమస్యలన్నిటికీ చెక్ పెట్టేందుకు తెలంగాణ సర్కార్ గ్రేట్ హైదరాబాద్ లో భారీవరద నీటి సంపుల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది…

అభివృద్ధిలో హైదరాబాద్ మహానగరం దూసుకుపోతుంది. కానీ భారీ వర్షం వచ్చినప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఉండే పరిస్థితి దారుణం. గ్రేటర్ లో భారీ వర్షం వచ్చిన ప్రతిసారీ మెయిన్ మెయిన్ సెంటర్లన్ని వరద నీటితో నిండిపోతాయి. రోడ్లు కాస్తా చిన్నపాటి చెరువుల మారిపోతాయి. అది ఒకటో రెండో ప్రాంతాల్లో కాదు హైదరాబాద్ మహానగరంలో ఏకంగా 143 ప్రధాన ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి ఇది.

ఇంకేముంది ఎక్కడి వాహనాలు అక్కడే అయిపోతాయి… ఒక్క వాహనం ముందు కదిలితే ఒట్టు.. ఇలా ఎక్కడి వాహనాలు అక్కడ కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ లోనే ఇరుక్కుపోతాయి. ఎక్కడినుంచి ఎక్కడికి పోవాలన్నా అరగంటలో వెళ్లే ప్రయాణం ఐదు గంటల పాటు సాగుతుంది. నరకం అంటే ఇదే మరి. నగర జనాభా రోజురోజుకు పెరిగిపోతుంది ట్రాఫిక్ లో వాహనాల సంఖ్య కూడా రోజురోజుకు అంతకంతకు పెరిగిపో తుంది. దీనికి తోడు భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారి ట్రాఫిక్ సమస్యలు అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు పెద్ద సవాల్ విసిరుతున్నాయి.

ఈ సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ సర్కార్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సరికొత్త ఐడియాకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే పైలెట్ ప్రాజెక్టు కింద 16.5 కోట్ల రూపాయలతో 11 ప్రాంతాల్లో 12 భారీ వరద నీటి సంపులను నిర్మిస్తున్నారు. 90 వేల లీటర్ల కెపాసిటీ ఉన్న వరద నీటిని సంపుతో పాటు దాదాపు పది లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న భారీ వరద నీటి సంపలను ఇందులో నిర్మిస్తున్నారు. నాలుగు భారీ వరద నీటి సంపుల నిర్మాణం పూర్తయింది. కూడా పూర్తి కావల్సి ఉన్నాయి.

ఇప్పటికే సెక్రటేరియట్ ఎదురుగా బస్టాప్ వద్ద 1.94 కోట్ల రూపాయలతో ఆరు లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న సంపు నిర్మాణం పూర్తి చేశారు. అలాగే రాజ్ భవన్ రోడ్డులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ముందు 1.38 కోట్ల రూపాయలతో ఏడు లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న వరద నీటి సంప్‌ను పూర్తి చేశారు. పక్కనే మరో మూడు లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న వరద నీటి సంపును 1.05 కోట్ల రూపాయలతో పూర్తి చేశారు. కేసీపీ జంక్షన్ వద్ద మూడు లక్షల లీటర్ల కెపాసిటీ ఉన్న సంప్‌ను 1.36 కోట్ల రూపాయలతో కంప్లీట్ చేశారు.

భారీ వర్షాలు వచ్చినప్పుడు వరద నీరంతా ఈ సంపుల్లోకి వెళ్తుంది. అక్కడ సంపులో ఉన్న సబ్మెర్జబుల్ మోటర్ల ద్వారా వరదనీటిని సమీప హుస్సేన్ సాగర్ లోకి లేదా సమీప నాళాల్లోకి పంపించేసేసి రోడ్లపై వరద నీరు నిలవకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా చూస్తారు. ప్రస్తుతం నిర్మించిన భారీ వరద నీటి సంపులు ఇంకుడు గుంతల్లాగా కూడా పనిచేసే విధంగా నిర్మించారు.

ఇవి సక్సెస్ అయితే మరో రెండు సంవత్సరాల లోపల 50 ప్రాంతాల్లో 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో భారీ వరద నీటి సంపులను నిర్మించడానికి ప్రభుత్వం ప్లాన్ చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పూర్తయిన భారీ వరద నీటి సంపులను ప్రారంభించాలని అధికారులు ఏర్పాటు పూర్తి చేశారు.

About Kadam

Check Also

బ్రదరూ.! బీ కేర్‌ఫుల్.. 90 రోజుల్లో పెండింగ్ చలాన్లు కట్టకపోతే ఇకపై వెహికల్స్ సీజ్

ఇప్పటికే పలు రోడ్డు ప్రమాదాలు విషయంలో హెల్మెట్స్ పెట్టుకోకపోవడమే కారణం కావడంతో సీరియస్ అయిన హైకోర్టు.. పోలీసులకు కీలక ఆదేశాలను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *