తెలంగాణలో నేటి నుంచి ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్.. కారణం ఇదే

ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం కీలక చర్చలు నిర్వహించింది. చర్చలు సానుకూలంగా జరిగాయని.. బంద్‌ను విరమించాలని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలను కోరినట్లు ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు పూర్తయినట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు సానుకూలంగా జరిగినట్లు వెల్లడించారు. చర్చల్లో భాగంగా విద్యాసంస్థల యాజమాన్యాలను సమ్మె విరమించాలని కోరినట్లు భట్టి పేర్కొన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాల సమస్యలపై ఇవాళ నిర్ణయం తీసుకుంటామని భట్టి విక్రమార్క తెలిపారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు తక్షణం విడుదల చేయకపోతే ఈనెల 15 నుంచి కళాశాలలను నిరవధికంగా బంద్‌ చేయనున్నట్టు తెలంగాణ ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ప్రకటించింది.

ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డిని కలిసిన సమాఖ్య సభ్యులు.. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు విడుదల చేసే వరకు బంద్‌ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే.. ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలతో హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ రామకృష్ణా రావు చర్చలు జరిపారు. చర్చలకు సంబంధించిన కీలక విషయాలను భట్టి విక్రమార్కను వెల్లడించారు.


About Kadam

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *