రాష్ట్రంలో అమలయ్యే చాలా ప్రభుత్వ స్కీమ్‌లకు రేషన్ కార్డు లింక్ ఉంది. దీంతో వీటి కోసం నిరీక్షిస్తున్నారు. రేషన్ కార్డులపై ప్రజలు ఎదురు చూస్తున్న తరుణంలో సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్డుల జారీపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు ఉత్తమ్. అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు. త్వరలో ఈ ప్రక్రియ షురూ అవుతుందన్నారు. సంక్రాంతి పండుగ నుంచి రేషన్ కార్డుల మంజూరు మొదలవుతుందన్నారు ఉత్తమ్. ఇప్పటికే ఈ విషయంపై క్యాబినెట్ సబ్ కమిటీ వేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్నబియ్యాన్ని కూడా అర్హులకు అందిస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి ఉత్తమ్ ప్రకటించారు.
Check Also
వీడేం దొంగరా సామీ..! చోరీకి వచ్చి ఏం ఎత్తుకెళ్ళాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
వాళ్లు మామూలు దొంగలు కాదు. సింపుల్‌గా వస్తారు. గేటు తీసుకుని దర్జాగా వెళ్తారు. ఏదో అందినకాడికి తీసుకెళ్లే రకం కాదు.. …