తెలంగాణ మహిళలకు మరో శుభవార్త… స్టాంప్‌ డ్యూటీ నుంచి వారికి మినహాయింపు యోచన

తెలంగాణలో మహిళల అభివృద్ధిపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మరో గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇప్పటికే మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా తాజాగా మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో మహిళల సక్షేమానికి పెద్దపీట వేస్తూ కొత్త స్టాంపు డ్యూటీ చట్టాన్ని రూపొందించేందుకు కసరత్తు చేస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరాక రెవెన్యూ శాఖ ప్రక్షాళనపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. ఈ క్రమంలో గతంలో ఉన్న ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చారు. ఇదే క్రమంలో తాజాగా మరొక సంచలన నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ సర్కార్ ముందుకు కదులుతోంది. ఈ కొత్త సవరణ బిల్లును రాబోయే శాసనసభ సమావేశాలలో ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి ప్రకటించారు. కొత్త సవరణ బిల్లులో మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా వారికి స్టాంప్ డ్యూటీ తగ్గించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి పొంగులేటి వెల్లడించారు.

అయితే ప్రస్తుతం పాత, కొత్త అపార్టుమెంట్లలోని ఫ్లాట్ లకు స్టాంప్ డ్యూటీ ప్రస్తుతం ఒకే విధంగా ఉంది. పాత అపార్టుమెంట్లకు రిజిస్ట్రేషన్ తేదీలను పరిగణలోకి తీసుకొని స్టాంప్ డ్యూటీ ని తగ్గించే ఆలోచనలో ఉన్నామని మంత్రి ప్రకటించారు. దీనికి సంబంధించి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును తీసుకురావడానికి కార్యాచరణ మొదలు పెట్టామని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

భారతీయ స్టాంపు చట్టం 1899 ప్రకారం తెలంగాణ పరిధిలో నాలుగు సెక్షన్లు , 26 ఆర్టికల్స్ ను సవరించే బిల్లను 2021లో శాసనసభ ఆమోదించింది. అనంతరం బిల్లను కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపారు. ఆ బిల్లుపైన కేంద్రం పలు అభ్యంతరాలను లేవనెత్తింది. కేంద్ర అభ్యంతరాలకు సమాధానం ఇచ్చినప్పటికీ 2023 జనవరిలో సవరణ బిల్లును వాపస్‌ పంపింది. దీంతో ప్రస్తుత అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాతబిల్లు స్థానంలో కొత్త బిల్లును రూపొందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇక సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం పడకుండా భూముల ధరల సవరించేందుకు ప్రతిపాదనలను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *