రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 8, 9 తేదీలో ఐసెట్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐసెట్ ఫలితాలను జులై 7న విడుదల చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించారు..
తెలంగాణ రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 8, 9 తేదీలో ఐసెట్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐసెట్ ఫలితాలను జులై 7న విడుదల చేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించారు. ఈ మేరకు ఐసెట్ కన్వీనర్, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రవి ఉన్నత విద్యామండలికి సమాచారం ఇచ్చారు. జులై 7 (సోమవారం)వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఈ ఫలితాలను వెల్లడించనున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత అధాకారిక వెబ్‌సైట్ నుంచి ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జులై 8 నుంచి అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు కౌన్సెలింగ్
ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనిరవర్సిటీ పరిధిలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ జులై 8 నుంచి ప్రారంభంకానుంది. జులై 11 వరకు వర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ విద్యాసాగర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంట్రన్స్ టెస్టులో వచ్చిన ర్యాంకులు, రిజర్వేషన్ నిబంధనల మేరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమతోపాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావల్సి ఉంటుంది. అలాగే కౌన్సెలింగ్ సమయంలో ఫీజు మొత్తం కూడా తీసుకురావాలని సూచించారు. కౌన్సెలింగ్ తేదీల వారీగా ర్యాంకులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.