జూనియర్‌ కాలేజీల్లో ముందస్తు అడ్మిషన్లు.. ఇంటర్‌ బోర్డు సీరియస్‌ వార్నింగ్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 5 నుంచి ప్రారంభమై మార్చి 20వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పరీక్షలు ఇంకా ముగియకముందే పలు ప్రైవేట్ జూనియర్‌ కాలేజీలు ఇష్టారాజ్యంగా ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాలు చేపట్టసాగాయి. దీంతో పలువురు ఇంటర్ బోర్డుకు ఫిర్యాదులు చేశారు. దీనిపై స్పందించిన బోర్డు తాజాగా ప్రకటన జారీ చేసింది..

రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీల్లో ముందస్తు అడ్మిషన్లపై ఇంటర్ బోర్డుకు ఫిర్యాదులు క్యూ కట్టాయి. దీనిపై ఇంటర్‌ బోర్డు బుధవారం ప్రకటన జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ ప్రవేశాలు చేపడితే చర్యలు తప్పవని ప్రైవేట్ జూనియర్‌ కాలేజీలకు వార్నింగ్ ఇచ్చింది. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్‌ అడ్మిషన్లకు సంబంధించి జూనియర్ కాలేజీల ఇంకా షెడ్యుల్ ఇవ్వలేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. అనుబంధ కాలేజీల గుర్తింపు అయ్యాకే అడ్మిషన్లు తీసుకోవాలని విద్యార్ధుల పేరెంట్స్‌కు సూచించింది. బోర్డు అడ్మిషన్ల షెడ్యుల్ విడుదల చేయకముందే కాలేజీలు ముందస్తు అడ్మిషన్లు చేపట్టొద్దని జూనియర్‌ కాలేజీల యాజమన్యాలకు సూచించింది.

ఈ నేపథ్యంలో ఇంటర్‌ ప్రవేశాలకు సంబంధించి తాము ఇంకా షెడ్యూల్‌ జారీ చేయలేదనీ, విద్యార్ధులు- తల్లిదండ్రులు షెడ్యూల్‌కు ముందే ప్రవేశాలు చేపట్టరాదని సూచించింది. షెడ్యూల్‌ ఎప్పుడు విడుదల చేసేది త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడిస్తామని స్పష్టం చేసింది. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ జూనియర్‌ కాలేజీలకు కూడా ఇంటర్‌ బోర్డు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చింది. కొత్త అకడమిక్‌ సెషన్‌కు ఇంటర్‌ బోర్డు ఇచ్చే షెడ్యూల్‌ ప్రకారంగానే ప్రవేశాలు చేపట్టాలని, ఇందుకు విరుద్ధంగా ప్రవేశాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

About Kadam

Check Also

టెన్త్‌ ఫలితాల్లోనూ అమ్మాయిల హవా.. అన్ని జిల్లాల్లో వారే టాప్‌

రాష్ట్ర పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు బుధవారం (ఏప్రిల్‌ 23) ఉదయం 10 గంటలకు విద్యశాఖ మంత్రి నారా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *