ఇంటర్‌ సప్లిమెంటరీ మార్కుల మెమోలు వచ్చేశాయ్.. డైరెక్ట్ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

తెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్‌ 16న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో 50.82 శాతం విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 4,13,880 మంది విద్యార్ధులు సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఇందులో ఫస్ట్‌ ఇయర్‌లో 2,49,358 మంది పరీక్షలు రాస్తే.. అందులో 1,68,079 మంది అంటే 67.4 శాతం ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 1,47,518 మంది పరీక్షలు రాయగా.. ఇందులో 76,260 మంది ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీకి రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు జూన్‌ 17 నుంచి జూన్‌ 23వ తేదీ వరకు అవకాశం కూడా ఇచ్చారు. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ.100 చొప్పున విద్యార్ధులు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రీవెరిఫికేషన్‌తోపాటు స్కాన్‌ కాఫీ పొందుకు ఒక్కో సబ్జెక్టుకు రూ.600 చెల్లించవల్సి ఉంటుంది. మరోవైపు ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షార్ట్‌ మెమోలను కళాశాలలకు పంపామని ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. విద్యార్థులు సైతం వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. మార్కుల మెమోల్లో పొరపాట్లు ఉంటే పది రోజులలోపు ప్రిన్సిపాళ్ల ద్వారా తెలియజేయాలని సూచించారు.

తెలంగాణ పీజీ ఇంజినీరింగ్‌ సెట్‌ ప్రారంభం

తెలంగాణ రాష్ట్రంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి పీజీఈసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు జూన్‌ 16 నుంచి ప్రారంభమైనాయి. జూన్‌ 19వ తేదీతో ఈ పరీక్షలు ముగుస్తాయి. ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25,334 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా మొత్తం 19 విభాగాల్లో ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌, గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఫార్మ్‌ డి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఎస్‌ఎస్‌సీ జీడీ కానిస్టేబుల్‌ ఫలితాలు.. 3వ మెరిట్ జాబితా ఇదే

ఎస్‌ఎస్‌సీ సీఏపీఎఫ్‌, ఎస్‌ఎస్‌ఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌, నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోలోని జీడి కానిస్టేబుల్ ఫలితాలకు సంబంధించిన మూడో మెరిట్‌ జాబితాను కమిషన్‌ విడుదల చేసింది. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్‌ కమిషన్‌(SSC) ప్రకటన జారీ చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను పొందవచ్చు. కాగా ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా 25.21 లక్షల మంది హాజరయ్యారు.

About Kadam

Check Also

ఎమ్మెల్సీ కవిత ఇంటికి వాస్తు దోషం.. అందుకే ఇన్ని ఇబ్బందులా..?

ఆ ప్రధాన ద్వారం వల్లనే ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారా? ఆ గేటు అక్కడ ఉండడం వలన రాజకీయంగా ఇబ్బందులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *