రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో చేరేందుకు ఇంటర్‌బోర్డు మరో అవకాశం కల్పించింది. రూ.1000 ఆలస్య రుసుముతో బుధవారం (సెప్టెంబర్ 17) వరకు అడ్మిషన్లు పొందేందుకు అవకాశం ఇచ్చింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరేవారికి మాత్రం ఎలాంటి ఆలస్య రుసుము లేకుండానే..
తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో చేరేందుకు ఇంటర్‌బోర్డు మరో అవకాశం కల్పించింది. రూ.1000 ఆలస్య రుసుముతో బుధవారం (సెప్టెంబర్ 17) వరకు అడ్మిషన్లు పొందేందుకు అవకాశం ఇచ్చింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరేవారికి మాత్రం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండానే ప్రవేశాలు కల్పిస్తారు. కాగా ఇప్పటికే పలు దఫాలుగా ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఇంటర్ బోర్డు పొడిగిస్తూ వచ్చింది. ఈ రోజుతో తుది గడువు ముగియ నుంది. ఇదే చివరి అవకాశమని, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రవేశాలు పొందడానికి అవకాశం ఉండబోదని బోర్డు తేల్చి చెప్పింది.
సెప్టెంబర్ 22 నుంచి తెలంగాణ ఎంపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్
తెలంగాణ రాష్ట్రంలో ఈఏపీసెట్ 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందులో భాగంగా ఎంపీసీ విద్యార్థులకు బీ ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 22 నుంచి అన్‌లైన్ కౌన్సెలింగ్ ప్రారంభవనున్నట్లు ప్రవేశాల కమి టీ కన్వీనర్ శ్రీదేవసేన వెల్లడించారు. ఇప్పటికే సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తవగా సెప్టెంబర్ 22, 23 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. ఇక సెప్టెంబర్ 23న ఆప్షన్లు ఫ్రీజ్ చేసుకుంటే.. సెప్టెంబర్ 25న సీట్లు కేటాయిస్తారు.