తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. ఏ తేదీన ఏ పరీక్ష ఉంటుందంటే..

తెలంగాణ ఇంగర్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది. మార్చి 5 నుంచి 15 వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ వార్షిక పరీక్ష షెడ్యూల్‌ సోమవారం (డిసెంబర్‌ 16) విడుదలైంది. ఈ షెడ్యూల్‌ ప్రకారం మార్చి 5 నుంచి 15 వరకు ఇంటర్‌ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. జనవరి 29న ఇంటర్‌ ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష, జనవరి 30న పర్యావరణ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జనవరి 31న, సెకండ్ ఇయర్‌కు ఫిబ్రవరి 1న నిర్వహిస్తారు.

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల షెడ్యుల్ ఇదే..

ఫస్ట్ ఇయర్ పరీక్షల తేదీలు ఇవే

  • 05-03-2025 – పార్ట్-2 సెకండ్‌ ల్యాంగ్వేజ్‌
  • 07-03-2025 – పార్ట్-1 ఇంగ్లీష్ పేపర్
  • 11-03-2025 – మాథ్స్ పేపర్ 1A, బోటని పపెర్-1 , పొలిటికల్ సైన్స్ పేపర్-1
  • 13-03-2025 – మ్యాథ్స్ పేపర్ 1B , జూలాజి పేపర్ -1, హిస్టరీ పేపర్-1
  • 17-03-2025 – ఫిజిక్స్ , ఎకనామిక్స్
  • 19-03-2025 – కెమిస్ట్రీ , కామర్స్

సెకెండ్ ఇయర్ పరీక్షల తేదీలు ఇవే

  • 06-03-2025 – పార్ట్-2 సెకండ్‌ ల్యాంగ్వేజ్‌
  • 10- 03-2025 – పార్ట్-1 ఇంగ్లీష్
  • 12-03-2025 – మాథ్స్ పేపర్ 2A, బోటని , పొలిటికల్ సైన్స్
  • 15-03-2025 – మ్యాథ్స్ పేపర్ 2B , జూలాజి, హిస్టరీ
  • 18-03-2025 – ఫిజిక్స్ , ఎకనామిక్స్
  • 20-03-2025 – కెమిస్ట్రీ , కామర్స్

About Kadam

Check Also

చిన్నారిపై లైంగిక దాడి.. కామాంధుడికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష..

చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన కామాంధుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. ఇంటిబయట ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి మాయమాటలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *