‘మతి, తెలివి ఉండే నా తలరాత ఇలా రాశావా..’ దేవుడికి రోహిత్ లేఖ రాసి మరి..

ఈ లోకం వదిలిపెట్టి వెళ్తున్నా.. దేవుడా. ఇలా ఎందుకు చేసావు.. మానసిక ఒత్తిడితో ఓ యువకుడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో విషాదాన్ని నింపింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..  ఓసారి లుక్కేయండి.

ఆశలన్నీ ఆవిరి అయ్యాయంటూ సూసైడ్ నోట్ రాసాడు ఓ యువకుడు. ఈ లోకం నాకు అన్యాయం చేసింది.. అందుకే బతుకలేకాపోతున్నా.. దేవుడు దగ్గరికి వెళ్తున్నానని.. సుసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఓ బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వేములవాడ పట్టణంలో మటన్ మార్కెట్ ఏరియాకు చెందిన దీటి వేణుగోపాల్, రాణి దంపతుల మొదటి కుమారుడు రోహిత్(24) సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం ప్రకారం.. అతడు కొంతకాలంగా మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తోంది.

సూసైడ్ లేఖలో ‘అన్నపూర్ణ దేవి కాపాడు.. కరుణించు, క్షమించు.! మతి, తెలివి ఉండే నా తలరాత ఇలా రాశావా.? అదే నీ కొడుక్కి అలా రాయలేదే.. మేము కొడుకులం కాదా.! అందమైన కలల జీవితాన్ని అనుభవించాలనుకున్నా.. కానీ నా ఆశలన్నీ ఆవిరి అయ్యాయి. నాకు మరోజన్మ అవసరం లేదు. నా మృతదేహాన్ని కాశీలో ఖననం చేయండి’ అని పేర్కొంటూ తుది శ్వాస విడిచాడు. ఈ లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.

ఓవైపు దేవుడు గురించి రాస్తూ.. మరోవైపు తన దురదృష్టం గురించి కూడా చెప్పాడు సదరు యువకుడు.ఇలాంటి కష్టం ఎవరికి రావద్దంటూ తెలిపాడు. అతడి ఆత్మహత్యతో కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. మానసిక రుగ్మత కారణంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

About Kadam

Check Also

మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు.. కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మాస్ రియాక్షన్..

ఎవరో వెనక నేనెందుకు ఉంటాను.. నేను ఎవరి వెనుక ఉండను.. ఉంటే ముందే ఉంటాను.. ప్రజలు తిరస్కరించిన వాళ్ల వెనుక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *