పర్యాటకులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. తెలంగాణ నయాగరగా భావించే బొగత జలపాతం సందర్శనకు అధికారులు అనుమతి ఇచ్చారు. వాజేడు మండలంలోని బొగత జలపాతానికి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో పర్యాటకులను అనుమతించాలని అధికారులు నిర్ణయించారు. అయితే అందులోకి దిగిందేకు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేశారు. వెంకటాపురం, వాజేడు మండలాల్లో అనుమతి లేని జలపాతాలకు వెళ్లిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.
రెండు రోజుల క్రితం ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో బొగత జలపాతం దగ్గర అత్యంత ప్రమాదకరంగా వరద ఉధృతంగా ప్రవహించింది. ప్రమాదం పొంచి ఉండటంతో జలపాతం దగ్గరికి ఎవ్వరినీ అనుమతించలేదు. ప్రస్తుతం వరద తగ్గడంతో మళ్లీ పర్యాటకులను అనుమతిస్తున్నారు.
తెలంగాణకు గర్వకారణమైన బొగత జలపాతాన్ని నయాగరాతో ఎందుకు పోల్చుతారో ఈ దృశ్యం చూస్తే మీకు అర్థం అవుతోంది. బొగత జలపాతం డ్రోన్ దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ సీన్ చూస్తే చాలు.. అక్కడకు వెళ్లిపోవాలని అనిపిస్తోంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. బొగత జలపాతం మనోహరంగా మారుతుంది. ఈసారి మరింత రమణీయంగా కనిపిస్తోంది ఈ అందాల జలపాతం. అయితే జలపాతం వద్ద వరద ఉదృతి హెవీగా ఉండటంతో ఇప్పటి వరకు పర్యాటకులకు అనుమతించ లేదు. అక్కడ పర్యాటకులు వెళ్లే ప్రాంతమంతా జలహోరుతో మునిగిపోయింది. ప్రస్తుతం జలహోరు దగ్గడంతో పర్యాటకులకు అనుమతించారు అధికారులు.