రాష్ట్రంలోని కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు పీజీ ఈసెట్ (PGECET), లాసెట్ 2025 (LAWCET) అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 1 నుంచి పీజీ ఈసెట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. ఇవి ఆగస్టు 9 వరకు కొనసాగుతాయి.
తెలంగాణలో పీజీ ఈసెట్ (PGECET), లాసెట్ 2025 (LAWCET) అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 1 నుంచి పీజీ ఈసెట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభంకానున్నాయి. ఇవి ఆగస్టు 9 వరకు కొనసాగుతాయి. అనంతరం ఆగస్టు 11, 12 తేదీల్లో మొదటి విడత వెబ్ ఆప్షన్లు కేటాయించడానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు 16న సీట్ల కేటాయింపు చేపడతారు. ఆగస్టు 18 నుంచి 21 వరకు సీట్లు పొందిన విద్యార్ధులు ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. లాసెట్ కౌన్సెలింగ్‌కు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఆగస్టు 4 నుంచి 14 వరకు కొనసాగుతాయి. ఆగస్టు 16, 17 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు, ఆగస్టు 22న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 22 నుంచి 25 వరకు సీట్లు పొందిన కాలేజీల్లో విద్యార్ధులుసెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం కల్పించారు.
తెలంగాణ పీపీఈసెట్ 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు: ఆగస్టు 1 నుంచి 9వ తేదీ వరకు
- వెబ్ ఆప్షన్లు: ఆగస్టు 11, 12 తేదీల్లో
- సీట్ల కేటాయింపు: ఆగస్టు 16న ఉంటుంది
- కాలేజీల్లో రిపోర్టింగ్: ఆగస్టు 18 నుంచి 21వ తేదీ వరకు
తెలంగాణ లా సెట్ 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్
కాలేజీల్లో రిపోర్టింగ్: ఆగస్టు 22 నుంచి 25వ తేదీ వరకు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు: ఆగస్టు 41 నుంచి 14వ తేదీ వరకు
వెబ్ ఆప్షన్లు: ఆగస్టు 16, 17 తేదీల్లో
సీట్ల కేటాయింపు: ఆగస్టు 22న ఉంటుంది