పాస్ పోర్ట్ ధ్రువీకరణలో దేశంలోనే టాప్‌.. రికార్డ్‌ క్రియేట్‌ చేసిన తెలంగాణ పోలీసులు!

పాస్ పోర్ట్ అప్లికేషన్ వేరిఫికేషన్‌లో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచారు. రాష్ట్ర పోలీసులు రూపొందించిన వెరీ ఫాస్ట్ యాప్‌కు బెస్ట్ సర్వీస్ అవార్డు దక్కింది. మంగళవారం పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరిటా చేతుల మీదుగా ఉత్తమ సేవా ధ్రువీకరణ పత్రాన్ని ఇంటలిజెన్స్ చీఫ్ బి. శివధర్ రెడ్డి అందుకున్నారు.

తెలంగాణ పోలీసులను వరుస అవార్డులు వరిస్తున్నాయి. ఇటీవలే జాతీయ స్థాయిలో అత్యుత్తమ పోలీసింగ్‌ నిర్వహిస్తున్న కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్ర పోలీసు శాఖ తాజాగా మరో అవార్డును చేజిక్కించుకుంది. పాస్ పోర్ట్ అప్లికేషన్ వేరిఫికేషన్‌లో తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచారు. రాష్ట్ర పోలీసులు రూపొందించిన “వెరీ ఫాస్ట్” అనే పాస్ట్‌ పోస్ట్‌ వెరికిఫికేషన్ యాప్‌కు గాను “బెస్ట్ సర్వీస్” అవార్డు దక్కింది. మంగళవారం పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరిటా చేతుల మీదుగా ఉత్తమ సేవా ధ్రువీకరణ పత్రాన్ని తెలంగాణ ఇంటలిజెన్స్ చీఫ్ బి. శివధర్ రెడ్డి అందుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర పోలీసులు రూపొందించిన ఈ ” వెరీ ఫాస్ట్” (VeriFast) యాప్ పాస్‌ పోర్ట్‌ వెరిఫికేషన్ ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు ఎంతగానో దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. దీని సహాయంతో దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం మూడు రోజుల్లోనే పాస్ పోర్ట్ వేరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయొచ్చన్నారు. ఈ యాప్‌ ద్వారా రోజుకు సరాసరిన 2 వేలకు పైగా అప్లికేషన్‌లు పరిశీలిస్తున్నామని, ఏడాదికి 8 లక్షలకుపైగా పాస్‌పోర్టులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఈ యాప్‌ పనితీరుపై పాస్‌పోర్ట్‌ అప్లై చేసుకున్న వారిలో 95 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపారు.

ఈ VeriFast యాప్‌ అండ్రాయిడ్ , ఐవోఎస్ , విండోస్ , లైనక్స్ వంటి అన్ని అపరేటింగ్ సిస్టమ్స్‌లో సపోర్ట్ చేస్తుందని పోలీసులు తెలిపారు. ఈ యాప్‌లోని ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేషన్, ఇంటెలిజెన్స్ డేటాబేస్‌తో పాత నేరస్థులను కూడా ఈజీగా గుర్తించ వచ్చని అధికారులు చెబుతున్నారు.. VeriFast యాప్ రాష్ట్ర పోలీసుల సాంకేతిక వినియోగ సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తోందని తెలిపారు.

About Kadam

Check Also

నిరుద్యోగులకు ఎగిరి గంతేసే న్యూస్.. త్వరలోనే 5 జాబ్ నోటిఫికేషన్లు వస్తున్నాయ్!

రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పరిధిలో దాదాపు 24 డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్ల (డిప్యూటీ ఈఓ) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *