తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్‌రావుకు భద్రత పెంచాలని నిర్ణయించింది. మావోయిస్టుల నుంచి ఇటీవల రఘునందన్ రావుకు బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో ఆయన భద్రతపై పోలీస్ శాఖ ధృష్టి సారించింది. ఈ బెదిరింపు కాల్స్‌పై క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసు శాఖ, ఆయనకు అదనపు భద్రత అవసమని నిర్ణయించారు. ఈ మేరకు రఘునందన్ రావుకు అదనపు భద్రత కల్పించాలని మెదన్ జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఇటీవల మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని ఒక ప్రైవేటు పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి హాజరైన ఎంపీ రఘునందన్ రావుకు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం రేపింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను మధ్య ప్రదేశ్‌కు చెందిన పీపుల్స్ వార్ మావోయిస్టునంటూ.. సోమవారం సాయంత్రంలోగా ఆయన్ను హతమారుస్తానని హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. అయితే అగంతకుడు ఫోన్ చేసిన సమయంలో ఫోన్ మాట్లాడిన రఘునందన్‌రావు పీఏ.. ఈ బెదిరింపులపై రాష్ట్ర డీజీపీ ఫిర్యాదు చేశారు.
ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ పోలీస్ శాఖ, ఆయనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌పై విచారణకు ఆదేశించింది. దీనిపై విచారణ జరిపిన తెలంగాణ పోలీస్ శాఖ రఘునందన్‌రావుకు అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని నిర్ణయించింది. ఈ మేరకు ఇక నుంచి రఘునందన్‌రావు పర్యటనల సమయంలో సాయుధ పోలీసులతో కూడిన ఎస్కార్ట్ ( armed forces escort) ను ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ముగ్గురు ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది.
Amaravati News Navyandhra First Digital News Portal