తెలంగాణలోని పాఠశాలలకు దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. దసరా పండుగతో పాటు బతుకమ్మ ఉత్సవాలు కూడా కలిసి రానుండటంతో విద్యార్థులకు వరుసగా 13 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం..
ఆగస్ట్ నెలలో పాఠశాలలకు భారీగా సెలవులు వచ్చాయి. ఇప్పుడు సెప్టెంబర్ నెల ప్రారంభమైంది. ఇది పండగ సీజన్. విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ఆగస్ట్ నెలలో చాలా రోజుల పాటు సెలవులు ఉండగా, సెప్టెంబర్‌లో కూడా భారీగా విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. హిందువులకు ముఖ్యమైన పండగలలో దసరా ఒకటి. ఈ పండగ అక్టోబర్ 2వ తేదీన వస్తోంది. దీంతో దసరా సెలవులు రానున్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ సంవత్సరం దసరా పండుగ సెలవుల కోసం ఎదురు చూడవచ్చు.
13 రోజుల పాటు సెలవులు:
విద్యాశాఖ అధికారిక అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు అంటే 13 రోజుల పాటు దసరా సెలవులకు పాఠశాలలకు సెలవులు ఉంటాయి. రెగ్యులర్ తరగతులు అక్టోబర్ 4న తిరిగి ప్రారంభమవుతాయి. సెలవులకు ముందు పాఠశాలలు తమ నిర్మాణాత్మక మూల్యాంకనం (FA) – 2 పరీక్షలను ముగించాలి. బతుకమ్మ పండుగతో ప్రారంభమయ్యే ఈ సెలవుల సీజన్ విద్యార్థులకు, వారి కుటుంబాలకు పెద్ద ఊరట.
ఈ సెలవుల మధ్యలోనే అక్టోబర్ 2న గాంధీ జయంతి కూడా ఉంది. ఇది సాధారణంగా ప్రభుత్వ సెలవుదినం. కానీ ఈసారి దసరా సెలవుల్లో కలిసిపోయింది. ఈ సెలవుల రోజుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు ముందుగానే ట్రిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు.