తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను విద్యాశాఖ విడుదల చేసింది. జూన్ 3 నుంచి జూన్ 13 వరకు జరిగిన టెన్త్ సప్లి ఎగ్జామ్ పేపర్స్ ను జూన్ 14 నుంచి 16 వరకు స్పాట్ వాల్యూయేషన్ చేశారు. పదో తరగతి సప్లీమెంటరి పరీక్షలకు 42,834 మంది దరఖాస్తు చేసుకోగా.. 38,741 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 28,415 మంది ఉత్తీర్ణలయ్యారు. పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాల్లో 73.35 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 71.05 శాతం, బాలికలు 77 శాతం ఉత్తీర్ణత సాధించారు. సప్లిమెంటరీ ఫలితాల్లో జనగామ జిల్లా 100 శాతం ఉత్తీర్ణతతో టాప్ లో నిలిచింది. సంగారెడ్డి జిల్లాలో అత్యంత తక్కువగా 55.90 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ కు సంబంధించిన www.bse.telangana.gov.in లో చూసుకోవచ్చు. రీకౌంటింగ్ కావాలనుకునే విద్యార్థులు జూలై 7 లోపు ఒక్కో సబ్జెక్టుకు 500 రూపాయల చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో సబ్జెక్టుకు 1000 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది.