రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన అంగన్‌వాడీ సిబ్బంది నియామకాల భర్తీకి సంబంధించి ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులపై సర్కార్ దృస్టిసారించింది. దక్షిణాది రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను శిశు సంక్షేమశాఖ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించింది. అంగన్వాడీ టీచర్ల నియామకాలకు సంబంధించి..
తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలోనే భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంగన్‌వాడీల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా పదోన్నతులు, ఉద్యోగ విరమణతో ఏర్పడిన ఖాళీల వివరాలను సేకరించింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,274 ఖాళీలు ఉన్నట్లు లెక్కతేలింది. నియామక విధానంలో అవసరమైన మార్పులు చేసేందుకు సర్కార్ దృష్టి సారించింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
సిబ్బంది కొరత వల్ల అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరత కారణంగా పోషకాహారం పంపిణీ, పూర్వప్రాథమిక విద్య వంటి కీలక సేవలు సక్రమంగా అందడం లేదు. కొన్ని కేంద్రాల్లో సహాయకులు అందుబాటులో లేకపోవడంతో పోషకాహారం అందించడం కష్టంగా మారుతోంది. టీచర్లు లేనిచోట విద్యార్థులకు పూర్వప్రాథమిక విద్య అందడం కాష్టసాధ్యంగా మారింది. ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని అంగన్వాడీల్లో ఖాళీల వివరాలను ప్రభుత్వం సేకరించింది. మొత్తం 15,274 ఖాళీలు ఉండగా.. వీటిలో 2,999 టీచర్ పోస్టులు, 12,275 సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఇతర రాష్ట్రాల్లో ఎంపికలపై అధ్యయనం..
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన అంగన్‌వాడీ సిబ్బంది నియామకాల భర్తీకి సంబంధించి ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులపై సర్కార్ దృస్టిసారించింది. దక్షిణాది రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను శిశు సంక్షేమశాఖ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదించింది. అంగన్వాడీ టీచర్ల నియామకాలకు తెలంగాణలో ఇంటర్ విద్యార్హతతో ఆన్‌లైన్ పరీక్షలు, ఏపీలో పదోతరగతి విద్యార్హతతో పరీక్షలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మౌఖిక పరీక్షలకు 20 మార్కులు కేటాయించారు. కేరళలో మాత్రం ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి మెరిట్ ఆధారంగా స్థానిక మహిళల్ని ఎంపిక చేస్తున్నారు. కర్ణాటకలో 12వ తరగతి ఉత్తీర్ణత కలిగిన వారికి ఈ పోస్టులను కేటాయిస్తున్నారు. ముఖ్యంగా ఈసీసీఈ, నర్సరీ, ఎన్‌టీటీ డిప్లొమా అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక తమిళనాడులోనూ ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి, టీచర్ ఇంటర్, హెల్పర్‌కు పదోతరగతి అర్హతలుగా నిర్ణయించారు. ఇక్కడ కూడా మెరిట్ ఆధారంగా పోస్టులకు ఎంపిక చేస్తున్నారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లో విద్యార్హతలు, ఎంపిక విధానంపై అధికారులు అధ్యయనం చేసి ఇచ్చిన ఈ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుత నియామక విధానంలో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది.