ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసింది.. పూర్తి వివరాలు ఇదిగో..!

తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ ప్రవేశాల కోసం ఎప్ సెట్ రాసి ర్యాంకులతో ఎదురుచూస్తున్న విద్యార్థులకు కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి మూడు దశల్లో కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జూన్ 28 నుంచే కౌన్సిలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ జూన్ 28 ప్రారంభం అవుతుంది.

ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్:

జూన్ 28న ప్రారంభం కానున్న మొదటి ఫేజ్ కౌన్సిలింగ్

జూన్ 28 నుంచి జులై 7 వరకు అప్లై, పేమెంట్, స్లాట్ బుకింగ్ ప్రక్రియ

జులై 1 నుంచి 8 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్

జులై 6 నుంచి 10 వరకు కాలేజీలను విద్యార్థుల ఎంపిక చేసుకునే ఛాన్

జులై 13న మాక్ సీట్ కేటాయింపు

జులై 14, 15 న కాలేజీల ఎంపికల మార్పులకు అవకాశం

జులై 18న ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు

జులై 18 నుంచి 22 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్ సైట్ లో రిపోర్ట్ చేసే వీలు

ఎప్ సెట్ సెకండ్ ఫేజ్:

జులై 25న సెకండ్ ఫేజ్ ప్రారంభం

జులై 26న ధ్రువపత్రాల పరిశీలన

జులై 26,27 తేదీల్లో కాలేజీల ఎంపిక చేసే అవకాశం

జులై 30న సీట్ల కేటాయింపు

జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు కాలేజీల్లో విద్యార్థుల రిపోర్టింగ్

చివరి ఫేజ్ ఎప్ సెట్ కౌన్సిలింగ్:

ఆగస్టు 5న ప్రక్రియ ప్రారంభం

ఆగస్టు 6న సర్టిఫికెట్ల వెరిఫికేషన్

ఆగస్టు 6,7న తేదీల్లో కాలేజీల ఎంపిక

ఆగస్టు 10న సీట్ల కెటాయింపు

ఆగస్టు 11 నుంచి 13 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్

About Kadam

Check Also

నిరుద్యోగులకు భలే న్యూస్.. ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌!

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎట్టకేలకు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఎప్పుడాని ఊరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగాలకు మోక్షం కలిగిస్తూ ఉద్యోగ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *