మరింత ఆలస్యం కానున్న టీజీపీఎస్సీ గ్రూప్‌ 3 ఫలితాలు.. కారణం ఇదే

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్స్‌ పరీక్షల ఫలితాలు, పోస్టుల భర్తీ ప్రక్రియను అవరోహణ క్రమం నిర్వహించాలని టీజీపీఎస్సీ బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే తొలుత గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు అక్టోబరు 21 నుంచి 27 వరకూ జరిపారు. ఆ తర్వాత గ్రూప్‌-3 పరీక్షలు నవంబరు 17, 18 తేదీల్లో జరిగాయి. గ్రూప్‌ 2 పరీక్షలు డిసెంబర్‌ 15, 16 తేదీల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల మాదిరిగాకాకుండా ఫలితాలను మాత్రం రివర్స్ విధానంలో విడుదల చేసేందుకు కమిషన్‌ సిద్ధం అవుతుంది. అంటే తొలుత గ్రూప్‌ 1 ఫలితాలు విడుదల చేసి, అందులోని పోస్టులన్నీ భర్తీ చేశాక.. గ్రూప్‌ 2 ఫలితాలు విడుదల చేసి.. ఆ పోస్టులు కూడా పూర్తిగా భర్తీ చేపట్టాలని భావిస్తుంది. ఆ తర్వాతే గ్రూప్‌ 3 ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించింది.

బ్యాక్‌లాక్‌లకు చెక్‌ పెట్టేందుకే ఈ విధానాన్ని అనుసరించనున్నట్లు టీజీపీఎస్సీ చెబుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రీలింక్విష్‌మెంట్‌ విధానం అమల్లో లేనందున, మెరిట్‌ ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అవకాశాలు కోల్పోకూడదన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. దీనిలో భాగంగానే ఉన్నత కేటగిరీ పోస్టుల తరువాత కింది కేటగిరీ పోస్టుల భర్తీ చేపట్టాలని. తద్వారా బ్యాక్‌లాగ్‌ను నివారించవచ్చని కమిషన్‌ భావిస్తోంది.

ఇప్పటికే గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరిలోగా వీటి ఫలితాలు ప్రకటించాలని, అనంతరం ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేసి, తుది ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. మార్చి నాటికి గ్రూప్‌ 1 నియామక ప్రక్రియ ముగించి, వెనువెంటనే గ్రూప్‌ 2 ఫలితాలు ప్రకటించాలని భావిస్తుంది. ఆ తర్వాతే గ్రూప్‌ 3 ఫలితాలు రానున్నాయి. గ్రూప్‌ 3లో 1388 పోస్టుల భర్తీ కోసం మూల్యాంకన ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. మొత్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి గ్రూప్స్‌ 1, 2, 3 పోస్టుల నియామకాలన్నీ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దళారుల మాయమాటలకు మోసపోవద్దని, ఎవరైనా దళారులు అభ్యర్థులను సంప్రదిస్తే విజిలెన్స్‌ సెల్‌ నంబరు 99667 00339కు సమాచారం ఇవ్వాలని లేదంటే vigilance@tspsc.gov.in ఈ-మెయిల్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్‌నికోలస్‌ తెలిపారు.

About Kadam

Check Also

రతన్ టాటా రూ.15 వేల కోట్లు ఎవరికి వస్తాయి? వీలునామాలో ఎవరి పేర్లు ఉన్నాయి?

రతన్‌టాటా ప్రస్తుతం మన మధ్య లేరు. గొప్ప వ్యాపారవేత్త.. అంతకుమించిన మహా మనిషి. వ్యాపారానికి, విలువలు జోడించిన వ్యక్తి. దిగ్గజ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *