వార్నీ ఎంతకు తెగించార్రా సామీ..! దాని కోసం ఏకంగా పిల్లాడినే ఎత్తుకెళ్లారు..!

గంజాయి కోసం ఏకంగా ఓ బాలుడిని కిడ్నాప్‌ చేశారు నిందితులు. కానీ పోలీసుల ఎంట్రీతో సీన్‌ రివర్స్‌ అయింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ కేసు.

అది సుందర అరకులోనే ప్రాంతం.. అక్కడకు పలనాడు నుంచి ఓ వ్యక్తి వచ్చాడు.. వస్తు పోతూ ఉన్న సమయంలో స్థానిక యువకులతో పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత అతని స్నేహితులను తీసుకొచ్చి వారిని పరిచయం చేయించాడు. ఇక గంజాయి కోసం బేరసారాలు జరిగాయి. కొంత నగదు కూడా చేతులు మారింది. కట్ చేస్తే ఓ బాలుడిని కిడ్నాప్ చేసి.. వారం రోజుల తర్వాత గానీ వదిలిపెట్టలేదు.

పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. గంజాయి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. రోజురోజుకు గంజాయి గ్యాంగులు పెట్రేగిపోతున్నాయి. ఇప్పటివరకు దాడులకు తెగబడిన గంజాయి ముఠాలు ఇప్పుడు కిడ్నాప్‌ చేయడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా అనుకున్న సమాయానికి సరుకు పంపక పోవడంతో ఓ బాలుడిని కిడ్నాప్‌ చేశారు నిందితులు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటన అల్లూరి జిల్లా అరకులోయలో కలకలం రేపుతోంది.

అరకుకు చెందిన ప్రకాష్, సుశీల్ కుమార్‌కు పల్నాడుకు చెందిన యాసిన్, సంతోష్ మధ్య గంజాయి డీల్‌ కుదిరింది. దీంతో అరకుకు చెందిన ప్రకాష్, సుశీల్ కుమార్‌ 20వేల రూపాయలు ఫోన్ పే చేశారు యాసిన్, సంతోష్. అయితే ఒప్పందం ప్రకారం డబ్బులు తీసుకుని వారికి గంజాయి పంపలేదు. పైగా ఫోన్‌ స్విచ్ ఆఫ్‌ చేశారు ప్రకాష్, సుశీల్ కుమార్. దీంతో ప్రకాష్‌ బంధువైన ఓ బాలుడి పల్నాడుకు చెందిన యాసిన్, సంతోష్ కిడ్నాప్‌ చేశారు. తమకు గంజాయి లేదా రూ.లక్ష ఇస్తే బాలుడిని విడిచిపెడతామని వీడియో కాల్‌ చేసి బెదిరించారు. భయపడిపోయిన గంజాయి ఏజెంట్లు పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిందితులను ట్రాక్‌ చేసి బాలుడిని రక్షించారు పోలీసులు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను ట్రాక్ చేశారు. బాలుడిని సేఫ్‌గా సంరక్షించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దీంతోపాటు గంజాయి అమ్మకానికి సిద్ధపడి డబ్బులు తీసుకున్న ప్రకాష్, సుశీల్ కుమార్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అరకు లోయ ఎస్ఐ గోపాల్ రావు తో కలిసి డీఎస్పీ ప్రమోద్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. యువత గంజాయి వ్యవహారాలకు దూరంగా ఉండాలని సూచించారు డీఎస్పీ ప్రమోద్. గంజాయి అనర్ధాలపై ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, గంజాయి వ్యవహారాల్లో ఉంటే కేసుల్లో ఇరుకోక తప్పదని హెచ్చరించారు. గంజాయి అమ్మినా.. కొన్నా .. రవాణ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఎక్కడ గంజాయి పట్టిబడినా ఆ మూలాలు విశాఖ ఏజెన్సీలోనే ఉండటంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. గంజాయి ముఠా కదలికలపై నిఘా పెంచారు.

About Kadam

Check Also

వంశీ కేసులో దర్యాప్తు ముమ్మురం చేసిన పోలీసులు

– లెక్కలన్నీ తేలుస్తాం…! అందరిని బయటకు తీస్తాం..! అంటూ వల్లభనేని వంశీ కేసులో దూసుకుపోతున్నారు పోలీసులు. ఓవైపు టెక్నికల్‌ ఇన్వెస్టిగేషన్‌… …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *