వాడు కన్నేస్తే  జాకెట్లే మాయం.. ఆరు నెలలుగా జాకెట్లు దొంగలిస్తున్న వెరైటీ దొంగ !

ఓ వ్యక్తి మహిళల రవికెలు(జాకెట్లు) అపహరించడం అందర్నీ అశ్చర్యానికి గురిచేసింది. ఆ వింత దొంగని పోలీసులు పట్టుకున్నారు. అసలు ఎందుకు ఇలా జాకెట్లు దొంగతనం చేశావు అని పోలీసులు ప్రశ్నించగా, అది తన బలహీనత అంటూ కాళ్లపై పడ్డాడు. ఏం కేసు పెట్టాలో ఏంటో తెలియక పోలీసులు నిందితుడుకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.

దొంగతనం అరవై ఆరు కళల్లో ఒకటి.. శ్రీ క్రృష్ణుడు సైతం గోపికల వస్త్రాలు అపహరించేవాడు. గోపికలతో ఆడుతూ వారిని ఆటపట్టించేవారట. ఇలాంటి సరదా సన్నివేశాలు చాలా సినిమాల్లో నది గట్టుపై తమ వస్త్రాలు ఉంచి స్నానం చేస్తుండగా అక్కడ ఉన్న వాటిని హీరో తీసుకుని వెళ్లి హీరోయిన్‌ను ఏడిపించడం సీతాకోకచిలుక సినిమాలో హీరో మురళి, ముచ్చెర్ల అరుణ మధ్య డైలాగులు హాస్యాన్ని పండిస్తూనే సీన్లో హీరోయిన్‌లో ఆవేశాన్ని రేకెత్తిస్తాయి. ఇలాంటి ఘటనలు చూశాడో విన్నాడో , లేదా పురాణ పురుషులు స్ఫూర్తితనో, హీరోలు – విలన్ల ప్రభావంతోనో ఓ వ్యక్తి మహిళల రవికెలు(జాకెట్లు) అపహరించటం మొదలు పెట్టాడు. మూడు నెలల పాటు ముప్పు తిప్పలు పెట్టిన అతడిని పట్టుకుని ఫైనల్‌గా గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. ఏంటిరా ఈ పని బుద్ధి లేదా అని సదరు నిందితుడిని ఖాకీలు అదిలిస్తే అది తన బలహీనత అంటూ కాళ్లపై పడ్డాడు. ఏం కేసు పెట్టాలో ఏంటో తెలియక పోలీసులు నిందితుడుకి కౌన్సిలింగ్ ఇచ్చి మరోసారి ఇలాంటివి చేస్తే యాక్షన్ సీరియస్‌గా ఉంటుందని హెచ్చరించి పంపారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది.

నర్సాపురం మండలం దర్బరేవులో గత కొంతకాలంగా మహిళల రవికలు అపహరణకు గురవుతున్నాయి. స్నానం చేసే సమయంలో బాత్రూం గోడలు, తలుపులపై వదిలిన రవికె, జాకెట్లు మాత్రమే చోరికి గురవుతున్నాయి. తొలుత బాధితులు ఏదైనా కోతి ఎత్తుకెల్లిందో, ఎక్కడైనా ఉంచి మరిచి పోయామా అని సరి పెట్టుకున్నారు. కాని ఇది ఒక్కరి ఇంట్లో కాదు చాలా మంది ఇళ్లలో ఇలాగే రవికెలు మాయం అవుతుండటంతో కలకలం రేగింది. ఇప్పటి వరకు సుమారు 300 జాకెట్లు మాయం అయ్యాయి. రాత్రి సమయంలో నిఘా పెట్టిన ఇవి ఎలా మాయం అవుతున్నాయనే అనే విషయాన్ని కనిపెట్టలేకపోయారు. తాజాగా ఒక వ్యక్తి చేతిలో జాకెట్ కనిపించటం అతడి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అతడిని ఆపి ప్రశ్నించారు. అతడిని తనిఖీ చేస్తే సంచిలో ఇంకా జాకెట్లు కనిపించాయి. దీంతో ఆ రవికెల దొంగ ఇతడేనని నిర్ధారణకు వచ్చిన స్ధానికులు చెడామడా తిట్టి, నాలుగు చివాట్లతో మందలించి పోలీసులకు అప్పగించారు. నిందితుడిని పోలీసులు ప్రశ్నిస్తే వేములదీవి గ్రామం అని చెప్పాడు. దొంగిలించిన రవికెలు కాలువలో పడేసినట్లు చెప్పాడు. ఇలానే ఆరునెలలుగా చేస్తున్నట్లు తేలడంతో పోలీసులు నిందితుడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు.

ఇపుడు పశ్చిమగోదావరి జిల్లా తీరప్రాంతంలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేగింది. తమ ఇళ్లలో ఖరీదైన వస్తువులు ఏవీ పోకుండా కేవలం జాకెట్లు మాత్రమే మాయం అవుతుండటంతో మహిళలు పొరుగు వారిపై సైతం అనుమానం పడ్డారు. ఇలా గ్రామంలో వాదోపవాదాలు, తగువులు కూడా జరిగాయి. ఫైనల్‌గా దొంగ దొరకడంతో వినాయక వ్రతం చేయకుండా చవితి చంద్రుడిని చూసిన వాళ్లలా ఇప్పటిదాకా నిందలు మోసిన వాళ్లు ఇలా బయట పడ్డారు.

About Kadam

Check Also

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *