విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక ఆ ఇబ్బందులు ఉండవు..!

శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో జీఎంఆర్ గ్రూప్ కీలక ప్రకటన చేసింది. ఎయిర్‌పోర్టులో రెండో టెర్మినల్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇది ప్రయాణికుల రద్దీని త‌గ్గించ‌డంలో ఉప‌యోగప‌డనుంది. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రతి ఏడాదికి 3 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. ఈ సంఖ్య 4.5 కోట్లకు చేరుకున్న తర్వాత కొత్త టెర్మినల్‌ను జీఎంఆర్ గ్రూప్ పూర్తిగా వినియోగంలోకి తీసుకురానుంది .ఇప్ప‌టికే ఎఐతో ప‌ని చేసే ప్రెడిక్టివ్ ఆపరేషన్ సెంటర్‌ను (APOC) కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శంషాబాద్‌లో ప్రారంభించారు. కొత్త టెక్నాలజీలను ఎయిర్‌పోర్టు పనితీరులో ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణికులకు మరింత మెరుగైన సేవాలు అందించోచ్చు అనే భావ‌న‌లో జీఎంఆర్ గ్రూప్ ఉంది. డిజిటల్ ట్విన్ ప్లాట్‌ఫామ్ ద్వారా భద్రతా విధానాలను, సేవా సదుపాయాలను మరింత అప్‌డేట్ కానున్నాయి.

ఇటీవలి కాలంలో విమానయాన రంగానికి సంబంధించి భద్రతా సమస్యలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో, శంషాబాద్ ఎయిర్‌పోర్టు ప్రత్యేక భద్రతా చర్యలను చేపట్టింది. సైబర్ భద్రతకు సంబంధించి కూడా పటిష్టమైన విధానాలు అమలు చేస్తున్నారు. 2010లో కేవలం 65 లక్షల ప్రయాణికులతో ప్రారంభమైన ఈ విమానాశ్రయం ప్రస్తుతం సంవత్సరానికి 3 కోట్ల మందికి సేవలందిస్తోంది. రోజువారీ విమాన సర్వీసులు 220 నుండి 550కు పెరిగాయి. ఇది భారతదేశ విమానయాన రంగంలో ఉన్న ప్రగతికి నిద‌ర్శ‌నంగా మారింది.

వచ్చే 5 సంవత్సరాలలో దేశవ్యాప్తంగా 50 కొత్త విమానాశ్రయాలను నిర్మించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. “హవాయి చెప్పల్ సే హవాయి సఫర్” అనే నినాదంతో భారతదేశంలో విమాన సేవలను విస్తరించేందుకు ఇప్ప‌టికే కేంద్ర విమానయ‌నా శాఖ ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రెండో టెర్మినల్ ప్రారంభం, తెలంగాణను గ్లోబల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా మారుస్తుందనే పలువురిలో అభిప్రాయం ఉంది.

About Kadam

Check Also

అల్లు అర్జున్ అరెస్టు.. సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా పోస్టులు.. పోలీసుల రియాక్షన్ ఇదే..

డిసెంబర్ 4న అల్లు అర్జున్ పుష్ప2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట ఘటన జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *