ఆకర్షిస్తున్న ఆ ఈవీ స్కూటర్ అప్‌డేటెడ్ వెర్షన్.. ధరెంతో తెలిస్తే షాక్..!

భారతదేశంలో ఇటీవల కాలంలో ఈవీ స్కూటర్లకు అత్యంత డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో స్టార్టప్ కంపెనీల నుంచి టాప్ కంపెనీల వరకు తమ ఈవీ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన స్టార్టప్ రివర్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండీని అప్‌డేట్ చేసింది. ఈ అప్‌డేటెడ్ వెర్షన్లోని ఫీచర్లు వినియోగదారులను ఆకట్టుకుంటాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రివర్ ఇండీ అప్‌డేటెడ్ వెర్షన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

రివర్ ఇండీ అప్‌డేటెడ్ వెర్షన్ ధర ఇప్పుడు రూ.1.43 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది మునుపటి కంటే ఇప్పుడు రూ.18,000 ఎక్కువ. అయితే ధరకు తగ్గట్టు యూజర్లను ఆకట్టుకునేలా ఫీచర్లు కూడా ఉన్నాయి. గతంలో బెల్ట్‌తో నడిచే సిస్టమ్ స్థానంలో సింగిల్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కొత్త చైన్ డ్రైవ్ మెకానిజం జోడించారు. రివర్ ఇండీని తొలిసారిగా 2023లో బెంగళూరులో ప్రారంభించారు. అధిక గ్రౌండ్ క్లియరెన్స్, యూనిక్ డిజైన్ కారణంగా కంపెనీ దీనిని స్కూటర్ల ఎస్‌యూవీగా పరిజయం చేసింది. చైన్ డ్రైవ్ మెకానిజమ్‌కి మారడం వల్ల తక్కువ యాజమాన్య ఖర్చులతో యజమానులకు మెరుగైన విశ్వసనీయత లభిస్తుందని కంపెనీ పేర్కొంది. 

రివర్ ఇండీ ఇప్పుడు రెండు కొత్త రంగులలో అందుబాటులో ఉంది. వింటర్ వైట్‌తో పాటు స్టార్మ్ గ్రే రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. అయితే  ప్రస్తుతం మాన్‌సూన్ బ్లూ, సమ్మర్ రెడ్, స్ప్రింగ్ ఎల్లో ఉండగా దీన్ని రెండు రంగులకే పరిమితం చేశారు. రివర్ ఇండీ స్కూటర్‌ను ఓ సారి చార్జీ చేస్తే 110 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అయితే కంపెనీ ప్రతినిధులు మాత్రం 160 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుందని చెబుతున్నారు. .ఇండీలో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఎకో, రైడ్, రష్ మోడ్‌లు ఉండేవి. 4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగిస్తుంది. దీనిని 750 వాట్స్ ఛార్జర్‌ని ఉపయోగించి 5 గంటల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

ముఖ్యంగా ఈ స్కూటర్ సీటు కింద 43 లీటర్లతో కూడిన 55 లీటర్ల లాక్ చేయగల నిల్వ స్థలాన్ని కూడా కలిగి ఉంటుంది. ఈ స్కూటర్‌లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, 2 యూఎస్‌బీ పోర్ట్‌లు, 6 అంగుళాల రైడర్ డిస్‌ప్లే, ఫ్రంట్-సెట్ ఫుట్‌పెగ్‌లు వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఈ స్కూటర్ ఫార్వర్డ్, రివర్స్ పార్కింగ్ ఫీచర్లను ఆకర్షిస్తాయి. 

About Kadam

Check Also

అవి అబద్ధమైతే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటా.. కవిత సంచలన ఛాలెంజ్

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు, సవాళ్లు ప్రతిసవాళ్లు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *