చిన్నగా ఉందనుకోకండి.. వర్షకాలంలో బోడకాకరతో బోలెడు లాభాలు!

బోడ కాకరకాయ తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. వీటితో కర్రీ వండితే ఉండే టేస్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే బోడ కాకర కర్రీతో రుచి మాత్రమే కాదండోయ్, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. కాగా, వర్షాకాలంలో బోడకాకర కాయ తినడం వలన ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

బోడ కాకర కాయను కూరగాయల్లోనే కింగ్ అంటారు. ఎందుకంటే చికెన్, మటన్‌లో లభించనన్ని పోషకాలు ఇందులో లభిస్తాయి. అందుకే చాలా మంది బోడ కాకర కాయ తినాలని చెబుతుంటారు. మరీ ముఖ్యంగా వర్షకాలంలో ఇవి ఎక్కువగా లభిస్తుంటాయి. అయితే ఈ సీజన్‌లో బోడ కాకర తినడం వలన వైరల్ ఇన్ఫెక్షన్స్ దరి చేరవంట. ఇందులో అన్నిరకాల విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కాకరను మీ డైట్‌లో చేర్చుకోవాలని చెబుతుంటారు.

బోడ కాకరలో శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు లభిస్తాయి. విటమిన్స్,అమైనో ఆమ్లాలు, ప్లేవనాయిడ్స్, పోటాషియం, ఫాస్పరస్, ఇవన్నీ ఉంటాయి. అందుకే వర్షకాలంలో తప్పకుండా వీటిని తినాలంటారు. అదే విధంగా డయాబెటీస్ ఉన్న వారు వర్షాకాలంలో బోడ కాకర కాయను తినడం వల ఇది రక్తంలోని చక్కర స్థాయిలను నియంత్రిస్తుందంట. ఇందులో గ్లైసెమిక్ ఎక్కువగా ఉండటం వలన ఇది డయాబెటీస్ రోగులకు చాలా మేలు చేస్తుందంట.

అదేవిధంగా బోడకాకరలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. అలాగే ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, ఫాస్పరస్ వంటివి ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందు వలన బోడ కాకరను తినడం వలన క్యాన్సర్ వంటి సమస్యలు దరి చేరవంట. అంతే కాకుండా ఇది రక్త పోటు ప్రమాదాన్ని తగ్గించి, గుండె సమస్యలు రాకుండా చేస్తుందంట.

అలాగే బోడ కాకరలో విటమిన్ సి, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇది ఎముకల బలానికి చాలా మంచిది. అలాగే దీనిని వర్షాకాలంలో తినడం వలన వైరల్ ఇన్ఫెక్షన్స్, జలుబు, దగ్గు , వైరల్ ఫీవర్స్ నుంచి రక్షణ కలిపిస్తుందంట. అంతే కాకుండా బోడ కాకరలో ఎక్కువ మోతాదులో పొటాషియం ఉండటం వలన ఇది రక్తపోటు సమస్యతో బాధపడే వారికి మంచి ఔషధం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

బరువు తగ్గాలి అనుకునే వారికి కూడా బోడ కాకర చాలా మంచిదంట. దీనిని ప్రతి రోజూ తినడం వలన ఇది బరువును నియంత్రిస్తుందంట. ఎందుకంటే? బోడ కాకరలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. అందువలన దీనిని ప్రతి తీరోజూ తీసుకుంటే, ఇది కడుపు నిండిన భావన కలిగి అధిక ఆకలిని నియంత్రిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.

About Kadam

Check Also

దేశంలో అత్యంత పొడవైన రైల్వే నెట్‌ వర్క్ ఈ రాష్ట్రానిదే..! భారతీయ రైల్వేలో రారాజు.. ఎన్ని వేల కిలో మీటర్లంటే..

ఇక్కడ 150 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల ఐదు ప్రాచీన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అవి బ్రిటిష్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *