చెడ్డీ గ్యాంగ్ కాదు.. వీళ్లు అంతకుమించి.! ఏం దొంగతనం చేశారో తెలిస్తే స్టన్

నాటు కోడికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రుచి ఎక్కువే.. ధర ఎక్కువే. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా దొరుకుతాయి. గిరాకీ పెరుగుతున్న కొద్దీ.. దొంగల కన్ను వీటిపై పడింది. ఇలా చూసి అలా మాయం చేసి ఎత్తుకుపోతున్నారు. నాటు కోళ్లు పెంచే వారికి దొంగల బెడద ఎక్కువైంది. ఈసారి లోపలికి వెళ్లగానే దొంగలకు ప్లాన్ వర్కవుట్ కాలేదు.

నాటు కోళ్లపై దొంగలు కన్ను పడింది. మార్కెట్లో నాటు కోళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో.. వీటి ధర రోజురోజుకు పెరుగుతుంది. ఇదే అదునుగా భావించిన కొందరు కేటుగాళ్లు నాటు కోళ్ల ఫాములపై దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగలించిన నాటుకోళ్లను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని అనంతారం గ్రామ సమీపంలో నారా అన్వేశ్‌కు చెందిన కోళ్ల షెడ్‌లో దొంగలు పడి సుమారు 70 వేలు విలువచేసే కోళ్లను ఎత్తుకెళ్లారు. అదేవిధంగా మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ సమీపంలో మోదుగు ప్రభాకర్‌కు చెందిన కోళ్ల షెడ్‌లో ఓ గుర్తు తెలియని యువకుడు కోళ్లను దొంగలించేందుకు విఫలయత్నం చేశాడు. షెడ్డుకున్న జాలిని తొలగించి, లోపలకు ప్రవేశించి కోళ్లను ఎత్తుకెళ్లే క్రమంలో షెడ్‌లో అమర్చిన సీసీకెమెరా సైరన్ మోగడంతో పరారయ్యాడు.

ఈ రెండు సంఘటనలకు సంబంధించి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే క్రమంలో మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఇళ్లలోని కోళ్లను సైతం కొందరు కేటుగాళ్లు అపహరిస్తున్నారు. మార్కెట్లో కిలో నాటుకోడి ధర 500 పైగా ఉండడంతో మాంసం ప్రియులు సైతం నాటుకోడి మాంసం తినేందుకు మక్కువ చూడటంతో, ఈజీ మనీ అలవాటు పడిన కొందరు నాటు కోళ్ల దొంగతనానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దొంగల బెడద నుంచి నాటు కోళ్లును కాపాడాలని యజమానులు కోరుతున్నారు.

About Kadam

Check Also

తేజ్‌ నేను ఎవరితో మాట్లాడలేదురా.. నా కొడుకును మంచిగా చూసుకో.. ఇల్లాలు బలవన్మరణం

కేశవపట్నం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా తాడికల్‌కు చెందిన 27ఏళ్ల గొట్టె శ్రావ్య రాజన్న సిరిసిల్ల జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *