భక్తులకు శుభవార్త.. స్పర్శ దర్శనంపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం

స్పర్శదర్శనంపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లోనూ భక్తులకు స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం నూతన ఈవో శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. శని, ఆది, సోమవారాలు, పండుగ రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆయా సమయాల్లో స్పర్శదర్శనాలు, అభిషేకాలు నిలిపివేస్తూ శ్రీశైలం దేవస్థానం గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే.. భక్తుల విజ్ఞప్తితో దేవస్థానం వైదిక కమిటీ, అధికారులతో చర్చించి రద్దీ సమయాల్లోనూ స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. రద్దీ రోజుల్లో నాలుగు విడతల్లో అలంకార దర్శనం, మూడు విడతల్లో స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే.. సర్వదర్శనం క్యూలైన్లలో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజుకు మూడు విడుతల్లో స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.

గతంలో మాదిరిగానే స్పర్శదర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాలని.. కరెంట్‌ బుకింగ్‌కు అవకాశం లేదని స్పష్టం చేశారు. శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లోనూ మార్పులు చేశామన్నారు ఈవో శ్రీనివాసరావు. ఇక.. కొద్దిరోజుల క్రితమే ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు.. శ్రీశైల దేవస్థానం సిబ్బంది సహకారంతో మరింత అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే.. సర్శదర్శనం విషయంలో భక్తుల విజ్ఞప్తులు, సూచనల మేరకు నాలుగు రోజుల క్రితం వైదిక కమిటీ సభ్యులు, దేవస్థానం విభాగాల అధికారులు, పర్యవేక్షకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనే.. భక్తులకు విడతలవారీగా మల్లన్న స్పర్శదర్శనం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అటు.. శ్రీశైలం మల్లన్నను నిత్యం వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. పండుగల సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా.. కార్తీక మాసం, మహాశివరాత్రి రోజుల్లో శ్రీశైలం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది.

About Kadam

Check Also

విశాఖలో పెహల్గాం ఉగ్రదాడి కలకలం.. కాల్పుల్లో చంద్రమౌళి మృతి, కుటుంబంలో విషాదం

కాశ్మీర్‌ పర్యటనకు వెళ్లిన విశాఖపట్నం పాండురంగపురం కు చెందిన మూడు కుటుంబాలపై పెహల్గాం లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రిటైర్డ్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *