రాష్ట్రంలో పశ్చిమ, నైరుతి దిక్కు నుంచి గాలులు వీయనున్నాయి. ఈ రోజు, రేపు, తెలంగాణ లోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది..
పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరంలో సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దక్షిణ జార్ఖండ్, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 3.1, 7.6 కి.మీ మధ్య మరొక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణ లో పశ్చిమ, నైరుతి దిక్కు నుంచి గాలులు వీయనున్నాయి. ఈ రోజు, రేపు, తెలంగాణ లోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఈ రోజు తెలంగాణ లోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఏపీకి వర్ష సూచన..
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురంమన్యం జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.