సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 02 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. ఏ తేదీన ఏయే వాహన సేవలంటే..?

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించి.. భక్తిపారవశ్యంతో పునీతులవుతారు. ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీన ప్రారంభం అయి అక్టోబర్ 02వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు శ్రీవారు ఏ రోజు ఏ తేదీన ఏయే వాహనాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారో తెలుసుకుందాం..

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడి ఆలయంలో నిత్య కళ్యాణం పచ్చ తోరణం. ఇక స్వామివారికి జరిపే బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉంది. స్వయంగా సృష్టి కర్త అయిన బ్రహ్మదేవుడే శ్రీవారికి బ్రహ్మోత్సవాలు జరిపించినట్లు భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు కన్నులపండువగా జరుగుతాయి. ఈ ఉత్సవాలను దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు తండోపతండాలుగా వస్తారు. ఈ బ్రహ్మోత్సవాలను కనులారా తిలకించి.. భక్తిపారవశ్యంతో పునీతులవుతారు. ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీన ప్రారంభం అయి అక్టోబర్ 02వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్ 16వ తేదిన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు ముందు మంగళవారం రోజున ఆలయాన్ని శుద్ధి చేస్తారు.

బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యే తొలిరోజున ఉదయం స్వామివారికి సుప్రభాత, తోమాలసేవలు జరిగాక శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియ చేసి, నైవేద్యం సమర్పిస్తారు. ఆలయసన్నిధిలోని ధ్వజస్తంభంమీద పతాకావిష్కరణ చేస్తారు. బ్రహ్మోత్సవాలు జరిగీ తొమ్మిది రోజులు ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు , సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వాహన సేవలు ఉంటాయి.

బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యే తొలిరోజు సెప్టెంబర్ 24వ తేదీ 2025 సాయంత్రం 05:43 నుంచి 6.15 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణం చేస్తారు. ఈ రోజు రాత్రి 9 గంటలకు స్వామివారి పెద్ద శేష వాహనంపై ఊరేగుతారు.

సెప్టెంబర్ 25వ తేదీ 2025 బ్రహ్మోత్సవాలలో రెండో రోజు ఉదయం 8 గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహన సేవ.

సెప్టెంబర్ 26వ తేదీ 2025 బ్రహ్మోత్సవాలలో మూడో రోజు ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం సేవ

సెప్టెంబర్ 27వ తేదీ 2025 బ్రహ్మోత్సవాలలో నాలుగో రోజు ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం సేవ , మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనం సేవ

సెప్టెంబర్ 28వ తేదీ 2025 బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుండి రాత్రి గరుడ వాహనం సేవ

సెప్టెంబర్ 29వ తేదీ 2025 బ్రహ్మోత్సవాలలో ఆరో రోజు ఉదయంఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనం సేవ

సెప్టెంబర్ 30వ తేదీ 2025 బ్రహ్మోత్సవాలలో ఏడో రోజు ఉదయంఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహన సేవ

అక్టోబర్ 1వ తేదీ 0/2025 బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజు ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహనం సేవ

అక్టోబర్ 2వ తేదీ 0/2025 బ్రహ్మోత్సవాలలో చివరి రోజు తొమ్మిదో రోజు ఉదయం 6 నుండి 9 వరకు చక్రస్నానం, రాత్రి 8:30 నుంచి 10 గంటల వరకు ధ్వజావరోహణం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.)

About Kadam

Check Also

అరుణ అరచకాలు మామూలుగా లేవుగా.. ఏకంగా గన్నుతోనే బెదిరించింది.. మరో కేసు నమోదు..

నెల్లూరు లేడీ డాన్‌ నిడిగుంట అరుణ మెడకు ఉచ్చు మరింత బిగుస్తోంది.. ఆమెపై వరస కేసులు నమోదవుతున్నాయి.. తాజాగా.. మరో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *