రోజు రోజుకీ పెరుగుతోన్న శ్రీవారి ఆస్తులు, ఆభరణాలు.. కోనేటిరాయుడికి బంగారు శంఖు, చక్రాలు భూరి విరాళం..

కలియుగ దైవం వెంకన్న కొలువైన తిరుమల తిరుపతి క్షేత్రం. కోర్కెలు తీర్చే కోనేటి రాయుడిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకుంటున్నారు భక్తులు. భక్తులు భూరి సమర్పించే విరాళాలతో శ్రీవారి ఆస్తులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. మరోవైవు తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం నమోదు అవుతోంది.

తిరుమల వెంకన్నకు ఖరీదైన కానుకలు అందుతున్నాయి. హుండీ ఆదాయం తో పాటు రోజూ వస్తున్న విరాళాలు, కానుకలు కొండంతగా ఉంటున్నాయి. వడ్డీ కాసుల వాడి ఆస్తులను అంతకంతకు పెంచుతున్నాయి. ఇప్పటికే వేల టన్నుల బంగారు, వేలాది కోట్ల డిపాజిట్లు బ్యాంకుల్లో ఉన్న శ్రీవారికి మరిన్ని ఆభరణాలు, ఆస్తులు సొంతమవుతున్నాయి.

ఆపదమొక్కుల వాడి ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. భక్తుల రద్దీకి తగ్గట్టుగానే ఆదాయము పెరుగుతోంది. హుండీలో సమర్పించే కానుకలు, విరాళాలు వెంకన్నకు కొండంత ఆస్తిగా మార్చుతున్నాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి మొక్కులు చెల్లించే భక్తులు సమర్పించే కానుకలు ఇప్పుడు వెలకట్టలేనివిగా ఉంటున్నాయి. సామాన్యుడి నుంచి సంపన్నుడు దాకా ముడుపులు కట్టి వెంకన్న హుండీలో సమర్పిస్తున్న కానుకలు రికార్డులను బద్దలు కొడుతున్నాయి.

ఇందులో భాగంగానే ఈ రోజు శ్రీవారికి రూ 2.4 కోట్ల విలువ గల బంగారు శంఖు చక్రాల విరాళం అందింది. సుమారు రూ.2.4 కోట్ల విలువ గల బంగారు శంఖు చక్రాలను చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ సమర్పించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపం వద్ద సుమారు 2.5 కిలోల బరువుతో కూడిన శంఖు చక్రాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం అదనపు ఈవో దాతలను శేషవస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీవారికి భక్తులు అందించిన బంగారు శంఖు చక్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మరోవైవు తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం నమోదు అవుతోంది. సోమవారం శ్రీవారిని దర్శించుకున్న 77,044 మంది భక్తులు సమర్పించిన కానుకలతో శ్రీవారి ఒక రోజు హుండీ ఆదాయం రూ 5.44 కోట్లకు చేరింది. ఈ  నెలలో తొలిసారి గా ఒక రోజుకి రూ 5.44 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది. ఇప్పటి దాకా ఈ ఏడాదిలో నాలుగుసార్లు ఒక రోజులో రూ. 5 కోట్లకు పైగా హుండీ కానుకల ద్వారా ఆదాయం టీటీడీకి లభించింది. ఏప్రిల్ 1, మే 26, జూన్ 30, జూలై 28న ఈ నాలుగు రోజుల్లో రూ. 5 కోట్లు దాటడంతో వెంకన్న హుండీ ఆదాయం అంతకంతకు పెరుగుతోంది.


About Kadam

Check Also

కార్యకర్తల కోసం ప్రత్యేక యాప్.. టీడీపీ నేతలకు సినిమా చూపిస్తామన్న జగన్..

కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. వైసీపీ కార్యకర్తలు, సీనియర్ నేతలపై వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *