శ్రీవారి లడ్డూకు భారీ డిమాండ్.. ఒక్కరోజు ఆదాయం ఎన్ని కోట్లంటే..

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడు. ప్రపంచ వ్యాప్త భక్తులకు కొంగు బంగారమైనాడు శ్రీనివాసుడు. శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే లడ్డూ ప్రసాదం అంటే కూడా భక్తులకు పరమ పవిత్రం. ఈ లడ్డూ ప్రసాదానికి ఎంతో ప్రత్యేకత ఉంది. కాగా, స్వామివారి లడ్డూ ప్రసాదం కోసం కోట్లాది మంది భక్తులు నిరీక్షిస్తూ ఉంటారు. ఇటీవల టీటీడీ తీసుకువచ్చిన సంస్కరణలతో లడ్డుల డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం లడ్డు ప్రసాదం విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. ఈ ఏడాది జూన్ నుంచి సగటున రోజుకు నాలుగు లక్షల లడ్డూల విక్రయాలు జరుగుతున్నాయి.

తిరుమలలో ఈ ఏడాది జులై 12న రికార్డు స్థాయిలో 4,86,134 లడ్డూలు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే రోజున 3.24 లక్షలు విక్రయించగా అది 35 శాతం వరకు పెరగడం విశేషం. దీంతో ఆ ఒక్కరోజులోనే లడ్డూల విక్రయం ద్వారా రూ.2.43 కోట్లు సమకూరింది.

గత ఏడాది జులై నెలలో లడ్డూల తయారీ (చిన్నవి 160-180 గ్రాములు) 1,04,57,550 ఉండగా, ఈ ఏడాది జులైలో 1,25,10,300కు పెరిగింది. గత జులైలో 1,04,03,719 లడ్డూలు అమ్ముడుపోగా ఈ ఏడాది జులైలో 1,24,40,082 అమ్ముడుపోయాయి. దీంతోపాటు భక్తుల రద్దీ పెరిగినప్పుడు కూడా సరిపడా అవసరాల కోసం బఫర్‌ స్టాక్‌ కింద 4 లక్షలు పెట్టుకున్నారు.

ఇకపోతే, లడ్డూ నాణ్యత విషయంలోనూ టీటీడీ కీలక చర్యలు చేపట్టింది. లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి సరఫరా.. పరీక్షల కోసం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఇక.. తిరుమలలో వచ్చే నెలలో జరిగే బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ కసరత్తు మొదలు పెట్టింది.

ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానాల (TTD) సంస్థ తీసుకువచ్చిన సంస్కరణలతో లడ్డుల డిమాండ్ పెరిగిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.. లడ్డు నాణ్యత పెంచడం, ఉత్పత్తి పెంచడం, ఉత్పత్తి పెరిగేందుకు అవసరమయిన సిబ్బందిని నియామకాలు జరపడం, భక్తులందరికి లడ్డులు లభ్యమయ్యేందుకు అటంకాలు లేకుండా చర్యలు తీసుకోవడంతో డిమాండ్ పెరిగిందని టిటిడి అధికారులు చెప్పారు.

ప్రస్తుతం సెలవుల రోజుల్లో గతం కంటే భారీగా వస్తున్న భక్తుల కోసం అమలు చేస్తున్న క్యూ లైన్ మేనేజ్ మెంట్ సిస్టం ద్వారా దర్శనం చేసుకునే వారి సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. ఇక.. ప్రస్తుతం నవంబర్ మాసానికి సంబంధించిన దర్శనం.. వసతి.. సేవా టోకెన్ల పంపిణీ జరుగుతోంది.

About Kadam

Check Also

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు, రేపు అతి భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *