తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మించేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో అన్ని వసతులతో విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకుంది.
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించాలని టిటిడి నిర్ణయించింది. ఇందుకు గాను రూ.4.35 కోట్లు నిధులు కేటాయించింది. తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణానికి కమిటీ వేసిన టిటిడి అనేక కీలక అంశాలపై చర్చించింది. 58 అంశాల ఏజెండా తో సమావేశమైన పాలకమండలి వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ వ్యయం రూ.10 నుండి 20 లక్షలకు పెంచింది. ఇక టీటీడీలో 142 కాంట్రాక్ట్ డ్రైవర్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి సిఫారస్సు చేసింది. పాలకమండలి తీసుకున్న పలు కీలక నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ ఈవో లు మీడియాకు వివరించారు.
తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మించేందుకు సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయం తీసుకుంది. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాల్లో అన్ని వసతులతో విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకుంది. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా మౌలిక వసతులు, లైటింగ్, భద్రత, ఆధ్యాత్మిక ఆహ్లాదకర వాతవరణం పెంపొందించేందుకు నిర్ణయం తీసుకుంది.
తిరుమలలోని శిలాతోరణం, చక్రతీర్థం ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్, డీపీఆర్ రూపొందించాలని నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు, వివిధ దేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నిపుణుల కమిటీ నివేదిక సమర్పించింది. దీనిపై టీటీడీ ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసు కొన్నట్లు ఈవో స్పష్టం చేశారు. శ్రీవారిసేవ ను మరింత విస్తృత పరిచి భక్తులకు స్వచ్ఛంద సేవను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు 4 కో ఆర్డినేటర్ పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపాదికన భర్తీ చేసేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.ఇక శ్రీవారి భక్తులు సైబర్ మోసాలకు గురికాకుండా నియంత్రించేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది టిటిడి బోర్డు.