ఒక్కసారిగా పతనమైన టమాటా ధర.. కేజీ ఎంతో తెల్సా..?

మొన్నటివరకు పై చూపులు చూసిన టమాటా ధర ఒక్కసారిగా దారుణంగా పతనమైంది. ఏకంగా కిలో టమాటా ఒక్క రూపాయికి పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎక్కడో.. ఏంటో.. ఇప్పుడు తెలుసుకుందాం…

నిన్న మొన్నటి వరకూ టమాటా ఓ మోత మోగించింది. కొనాలంటేనే భయపడేలా చేసింది. సెంచరీ కొట్టి టమాటా సామాన్యులకు సవాల్‌ విసిరింది. ఆ తర్వాత.. చాలారోజుల వరకూ అరవై రూపాయలు.. కొద్దిరోజుల నుంచి నలభై రూపాయలు పలుకుతోంది. అయితే.. మారుతున్న మార్కెట్‌ పరిస్థితులతో టమాటా రేటు చిన్నగా దిగొచ్చింది. కొంతకాలంగా హెచ్చుతగ్గులతో నడుస్తున్న టమాటా ధర.. ఇప్పుడు ఒక్కసారిగా పతనమయింది. ఎంతలా అంటే.. ఊహించని రేంజ్‌లో పడిపోయింది. కిలో వంద రూపాయల వరకూ పలికిన టమాటా.. ఇప్పుడు ఒక్కరూపాయికి చేరుకోవడం టమాటా రైతులకు షాకిస్తోంది.

కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటా ధర కుప్పకూలి ఒక్క రూపాయికి పడిపోయింది. కిలో టమాటా రూపాయి పలకడంతోపాటు రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తెచ్చిన పంటను కొనడానికి కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో టమాటాలను రోడ్డు పక్కన పారబోసి వెళ్లిపోయారు రైతులు. అయితే.. పలు ప్రాంతాల నుంచి భారీగా టమాటా దిగుబడి వస్తుండటమే రేటు పడిపోవడానికి కారణమంటున్నారు స్థానిక రైతులు. సరుకు ఎక్కువ ఉండడంతో మార్కెట్‌లో టమాటా కొనేవారు లేకుండా పోయారని చెప్తున్నారు. ప్రధానంగా.. సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ వరకూ పంట దిగుబడి తక్కువగా ఉండడంతో టమాటా ధర ఎక్కువగా ఉంటుందంటున్నారు వ్యాపారులు.. అదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా దిగుమతులు తక్కువగా వస్తుంటాయని తెలిపారు. కానీ.. డిసెంబర్‌ నుంచి టమాటా పంట చేతికి వస్తుండడంతో.. అన్ని మార్కెట్‌లలో రాశులు పోసి రైతులు విక్రయించేందుకు సిద్ధమవుతుండడంతో టమాటా ధర తక్కువగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు. మొత్తంగా.. పతనమవుతున్న టమాటా ధర.. రైతులకు కన్నీళ్ళు మిగుల్చుతోంది.

About Kadam

Check Also

ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్ ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటి వరకంటే?

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ ఇయర్‌ ప్రవేశాల గడువు జూన్‌ 30వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *