కర్నూలు జిల్లాలో టమోటా ధరలు పాతాళానికి పడిపోయాయి. కిలో ఒకటి నుంచి రెండు రూపాయలకు ధర పడిపోయింది. దీంతో టమోటా రైతులు విలవిలలాడుతున్నారు.
టమోటా లేని ఇల్లు వంట బహుశా ఉండదేమో. అలాంటి టమోటా ధర మొన్నటి వరకు కిలో రూ.50. నేడు కిలో రూపాయి మాత్రమే. చాలా విచిత్రంగా ఉంది కదూ. నిజమే రైతులకు కిలో టమోటాకు దక్కుతున్నది కేవలం రూపాయి మాత్రమే. టమోటా కిలో రూ.20 నుంచి 25 రూపాయల వరకు బహిరంగ మార్కెట్లో విక్రయం జరుగుతోంది. పంట పండిస్తున్న రైతుకు కిలో రూపాయి.. వినియోగదారుడు కొంటున్నది కిలో ఇరవై రూపాయలు.. ఉత్పత్తిదారుడికి కొనుగోలు దారుడికి మధ్య ఇంత వ్యత్యాసం ఎప్పుడూ చూడలేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరలు కూడా విపరీతంగా హెచ్చుతగ్గులు ఉండటం పట్ల రైతులకు భరోసా లేకుండా పోతుందని అంటున్నారు.
కర్నూలు జిల్లాలో టమోటా ధరలు పాతాళానికి పడిపోయాయి. కిలో ఒకటి నుంచి రెండు రూపాయలకు ధర పడిపోయింది. దీంతో టమోటా రైతులు విలవిలలాడుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో మదనపల్లి తర్వాత అత్యధికంగా టమోటా పండించేది ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులే.. కర్నూలు జిల్లాలోని పత్తికొండ, ప్యాపిలి, ఆస్పరి తదితర మార్కెట్లలో ధరలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. రైతులు ఆయా మార్కెట్లకు టామోటోలను తీసుకొచ్చి వ్యాపారులకు విక్రయిస్తుంటారు. 20 కిలోల బాక్స్ క్వాలిటీని బట్టి వంద రూపాయలకు మించడం లేదు. సన్న సైజు నాణ్యతలేని టమోటాలు అయితే అసలు కొనేవారే లేరు.