ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న టైమింగ్..

డిజిటల్ చెల్లింపుల రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ, భారతదేశంలో దైనందిన జీవితంలో ఒక భాగంగా మారింది. నగదు రహిత లావాదేవీలను సులభతరం చేస్తూ, కోట్లాది మంది ప్రజల ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసింది. ఇప్పుడు యూపీఐ వినియోగదారులకు మరో శుభవార్త. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న తాజా నిర్ణయంతో, జూన్ 16 నుంచి యూపీఐ లావాదేవీలు మరింత వేగంగా, సమర్థవంతంగా జరగనున్నాయి. ఈ మార్పులు ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లావాదేవీలు జరిపే వారికి ఎలాంటి ప్రయోజనాలు కల్పిస్తాయి, ఎన్‌పీసీఐ నిర్దేశించిన ఈ మార్పుల వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి నాంది పలికిన యూపీఐ లావాదేవీలు ఇకపై మరింత వేగంగా జరగనున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తీసుకున్న కీలక నిర్ణయంతో జూన్ 16 నుంచి ఈ మార్పులు అమలులోకి వస్తాయి. వినియోగదారులకు మెరుగైన అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ఎన్‌పీసీఐ ఈ చర్యలు చేపట్టింది.

యూపీఐ సేవలకు సంబంధించిన వివిధ ఏపీఐల ప్రతిస్పందన సమయాన్ని ఎన్‌పీసీఐ తగ్గించింది. నగదు రహిత లావాదేవీలతో భారతీయుల దైనందిన జీవితాన్ని యూపీఐ సులభతరం చేసింది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎన్‌పీసీఐ నిరంతరం కొత్త నిబంధనలు జారీ చేస్తూ ఉంటుంది. తాజా ఆదేశాల మేరకు జూన్ 16 కల్లా తమ వ్యవస్థలలో అవసరమైన మార్పులు చేసుకోవాలని ఎన్‌పీసీఐ తన సభ్యులను ఆదేశించింది.

ఎన్‌పీసీఐ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, తరచుగా ఉపయోగించే యూపీఐ ఏపీఐలు లావాదేవీ స్థితిని తనిఖీ చేయటం, లావాదేవీ రద్దు (ట్రాన్సాక్షన్ రివర్సల్) – వంటి వాటికి గతంలో ఉన్న 30 సెకన్ల ప్రతిస్పందన సమయాన్ని 10 సెకన్లకు తగ్గించారు. అడ్రస్ ధ్రువీకరణ (పే, కలెక్ట్) యూపీఐ ఏపీఐకి సంబంధించిన ప్రతిస్పందన సమయాన్ని కూడా 15 సెకన్ల నుంచి 10 సెకన్లకు కుదించారు.

ఈ మార్పులు రెమిటర్ బ్యాంకులు, లబ్ధిదారుల బ్యాంకులు, ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎం వంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు (పీఎస్పీలు) లాభం చేకూర్చుతాయి. వేగవంతమైన ప్రతిస్పందన సమయాలతో, యూపీఐ వినియోగదారులు సులభంగా లావాదేవీలు పూర్తి చేయవచ్చు. ఫెయిలైన లావాదేవీలను రద్దు చేయటం, చెల్లింపుల స్థితిని తనిఖీ చేయటం వంటివి ఇప్పుడు కేవలం 10 సెకన్లలో పూర్తవుతాయి, ఇది గతంలో ఉన్న 30 సెకన్లతో పోలిస్తే గణనీయమైన మెరుగుదల.

“పైన పేర్కొన్న సవరణలు వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచటానికి ఉద్దేశించినవి. సవరించిన సమయాల్లో ప్రతిస్పందనలు జరిగేలా సభ్యులు తమ వ్యవస్థలలో అవసరమైన మార్పులు చేసుకోవాలి. భాగస్వామి చివరన ఏమైనా ఆధారపడటం ఉంటే, వర్తకుల స్థాయిలో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే, వాటిని కూడా తదనుగుణంగా చూసుకోవాలి” అని ఎన్‌పీసీఐ తన సర్క్యులర్‌లో పేర్కొంది.

About Kadam

Check Also

ఉపాధి హామీలో ఇకపై అలా నడవదు.. రెండు సార్లు ఫొటో దిగితేనే కూలీలకు డబ్బులు..

ఉపాధి హామీ పథకం.. ఎంతో మంది నిరుపేద గ్రామస్థులకు ఈ పథకం ఒక వరం. గ్రామాల్లో సరిగ్గా పని లేనివారిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *