అతుల్ ఆత్మహత్య.. తెరపైకి కొత్త డిమాండ్.. ఆ చట్టం తేవాలని..

బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది.

భార్య టార్చర్ తట్టుకోలేక బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ఆత్మహత్య చేసుకునే ముందు 40 పేజీల లేఖ రాసి.. మరో 80 నిమిషాల వీడియో తీసి.. తాను ఏ విధంగా వేధింపులకు గురవుతున్నానని విషయాన్ని ప్రస్తావించడం… ఎంతటి మానసిక క్షోభను అనుభవించాను అన్న విషయం స్వయంగా చెప్పి ఆత్మహత్య చేసుకోవడంపై దేశవ్యాప్తంగా ఒక చర్చకు దారి తీసింది. అంతేకాదు.. తనకు వేధించిన వారిని శిక్ష పడితే తన అస్తికలు నదిలో కలపండి.. లేకుంటే కాలువలో పడేయండి అన్న పదాలు ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి. దీన్నిబట్టి అతులు సుభాష్ ఎంతటి మానసిక క్షోభను అనుభవించాడో అర్థం అవుతుంది. ప్రస్తుతం పోలీసులు అతుల్ సుభాష్ భార్య, ఆమె కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. అయితే పురుషుల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టం చేయాలనే డిమాండ్ ఈ ఘటనతో దేశవ్యాప్తంగా వ్యక్తం అవుతుంది.

విశాఖలో కొవ్వొత్తుల ప్రదర్శన..

బెంగళూరులో టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్యపై విశాఖలో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సేవ్ ఫ్యామిలీ హార్మోనీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. అతుల్ సుభాష్‌కు నివాళులర్పించారు. భార్యతో విభేదాలు తట్టుకోలేక సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని.. ఆత్మహత్యలు చేసుకోకుండా పురుషులు ఎదురించి బతకాలని వారు పేర్కొన్నారు. మగవారికి వ్యతిరేకంగా చట్టాలు ఉండడం అన్యాయమన్నారు. పురుషుల కోసం ప్రత్యేక రక్షణ చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. మహిళలు పెట్టిన కేసులతో ఎందరో పురుషులు ఇబ్బందులు పడుతున్నానని.. వీటికి అడ్డుకట్ట పడాలని సేవ్ ఫ్యామిలీ హార్మోని వైజాగ్ చాప్టర్ అధ్యక్షుడు మధుసూదన్ రాజ్ ఆకాంక్షించారు.

About Kadam

Check Also

అల్లు అర్జున్ బౌన్సర్ అరెస్ట్‌.. ఆంటోనితో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌..

సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తొక్కిసలాటకు సంబంధించి అసలు సూత్రధారిగా భావిస్తున్న అల్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *