ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల లేఖలతో శ్రీవారి దర్శనం ఎప్పుడంటే…? గుడ్‌ న్యూస్‌ చెప్పిన టిటిడి

తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం అనుమతిపై టిటిడి క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారిన అంశంపై స్పష్టత ఇచ్చింది. ఈ నెల 14 న తెలంగాణ బిజెపి ఎంపీ రఘునందన్ రావు తిరుమలలో చేసిన కామెంట్స్ తో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోవడంతో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఈ మేరకు మార్చి 24 నుండి అమలు చేయాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టిటిడి కల్పించనుంది.

తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం అనుమతిపై టిటిడి క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారిన అంశంపై స్పష్టత ఇచ్చింది. ఈ నెల 14 న తెలంగాణ బిజెపి ఎంపీ రఘునందన్ రావు తిరుమలలో చేసిన కామెంట్స్ తో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోవడంతో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఈ మేరకు మార్చి 24 నుండి అమలు చేయాలని నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనాన్ని టిటిడి కల్పించనుంది. ఈ విధానం మార్చి 24 నుండి అమల్లోకి రానున్నట్లు ప్రకటన జారీ చేసింది. ఇందులో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించి తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుండి సిఫార్సు లేఖలను ఆది, సోమ, వారాల్లో మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా రూ. 300 దర్శనం టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురు వారాలలో మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. రూ 300 ల శ్రీవారి శీఘ్రదర్శనం ఏ రోజు కారోజు దర్శనం కల్పించనుంది.ఒకరికి ఒక సిఫార్సు లేఖను మాత్రమే ఆరు మందికి మించకుండా స్వీకరించడం జరుగుతుందని పేర్కొంది.

ఇప్పటివరకు సోమవారం విఐపి బ్రేక్ దర్శనానికి గాను ఆదివారం ఏపీ ప్రజా ప్రతినిధుల నుండి స్వీకరిస్తున్న సిఫార్సు లేఖలు ఇకపై శనివారం నాడు లేఖలు తీసుకుని ఆదివారం దర్శనం చేసుకునేలా స్వీకరించబడతాయని పేర్కొంది. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలను, ఇతర భక్తుల దర్శన సమయాలను దృష్టిలో ఉంచుకుని సుదీర్ఘంగా చర్చించాక పలు అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరమే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ప్రకటన చేసింది. ఈ మార్పులను భక్తులు దృష్టిలో ఉంచుకొని టీటీడీకి సహకరించాలని కోరుతోంది.

About Kadam

Check Also

డ్రైవరన్న జర భద్రం.. రోడ్డు ప్రమాదాల నివారణకు ఆ జిల్లా పోలీసుల వినూత్న కార్యక్రమం!

ఎక్కువగా రోడ్డుప్రమాదాలు రాత్రి పూటనే జరుగుతూ ఉంటాయి. ఇందుకు కారణం ఒకటి డ్రైవర్స్‌ నిద్రమత్తు, మరొకటి మద్యం సేవించి వాహనాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *