తిరుమల భక్తులకు టీటీడీ గొప్ప ప్రకటన చేసింది. సెప్టెంబర్ నెల కోటా తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు విడుదలకు సంబంధించిన వివరాలను ప్రకటించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే టీటీడీ సెప్టెంబర్ నెల దర్శనం.. గదుల కోటా విడుదల తేదీలను ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి దర్శనం, గదుల కోటా విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చునని టీటీడీ ప్రకటించింది. ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.
ఇక ఈ నెల 21న ఆర్జిత సేవా టికెట్ల విడుదలతో పాటుగా, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లను జూన్ 21న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అలాగే, ఈ నెల 23న అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్టు ఆన్‌లైన్ కోటా టికెట్లు, వయోవృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక దర్శన టికెట్లను ఉదయం 10గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూన్ 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
Amaravati News Navyandhra First Digital News Portal