తులసి వేర్లతో కషాయం..ఇలా వాడితే ఎన్నో వ్యాధులకు దివ్యౌషధం..!

తులసి ఆకులు, సారం జలుబు, దగ్గుకు మాత్రమే కాకుండా అనేక తీవ్రమైన వ్యాధులకు ఔషధంగా ఉపయోగపడుతుందని దాదాపు మనందరికీ తెలుసు. అయితే, తులసి ఆకులు, గింజలు మాత్రమే కాదు..తులసి వేర్లు కూడా అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. తులసి వేర్లతో కషాయం చేసి ఉపయోగిస్తే లెక్కలేనన్ని లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…

తులసి మొక్క లేని ఇల్లు చాలా అరుదు. మతపరమైన కారణాల వల్లనే కాకుండా దాని ఔషధ గుణాల కారణంగా కూడా ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది.. అయితే, తులసి ఆకులు, సారం జలుబు, దగ్గుకు మాత్రమే కాకుండా అనేక తీవ్రమైన వ్యాధులకు ఔషధంగా ఉపయోగపడుతుందని దాదాపు మనందరికీ తెలుసు. అయితే, తులసి ఆకులు, గింజలు మాత్రమే కాదు..తులసి వేర్లు కూడా అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. తులసి వేర్లతో కషాయం చేసి ఉపయోగిస్తే లెక్కలేనన్ని లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…

తులసి ఆకుల సారాన్ని ప్రతిరోజూ తీసుకుంటే అనేక తీవ్రమైన వ్యాధులకు చెక్‌ పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, నిరాశ వంటి తీవ్రమైన వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది. తులసి ఆకులతో చికిత్స చేస్తే ఒత్తిడి, నిరాశ తొలగిపోతాయి. తులసి ఆకులను ప్రతిరోజూ నమలడం వల్ల కార్టిసాల్ హార్మోన్ల స్రావం తగ్గుతుంది. ఇది ఒత్తిడి, కోపం వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. తులసి టీ లేదా కషాయం తీసుకోవటం వల్ల మూడ్ బూస్టర్‌గా పనిచేస్తాయి. అయితే, తులసి వేర్లతో కలిగే లాభాలు తెలిస్తే ఔరా అనాల్సిందే..

తులసి వేరు కషాయం శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జలుబు, దగ్గు, జ్వరం, సైనస్ సమస్యలు మొదలైన శ్వాసకోశ వ్యాధులకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాదు.. ఈ కాషాయం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతికూల శక్తి నుండి రక్షించడంలో సహాయపడుతుంది. తులసి వేర్ల కషాయంలో శరీరంలోని బ్యాక్టీరియా, వైరస్ వంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షించే గుణం ఉంది.

( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)


About Kadam

Check Also

బొద్దింకలను బెదరగొట్టి తరిమికొట్టే సింపుల్‌ టిప్స్‌..ఇలా చేస్తే మీ కిచెన్‌ ఆరోగ్యంగా ఉన్నట్టే..!

బొద్దింకలు ఏం చేస్తాయిలే అనుకుంటే పొరపాటే.. వీటిని లైట్‌ తీసుకోవద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బొద్దింకల వల్ల తీవ్రమైన అనారోగ్య …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *