టీవీ9 జర్నలిస్ట్‌పై మోహన్‌బాబు దాడిని ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయ్. జర్నలిస్టులతో పాటు అయ్యప్ప భక్తులు, ప్రజలు.. టీవీ9కి మద్దతుగా నిలబడుతున్నారు. మోహన్‌బాబును వెంటనే అరెస్ట్ చేయాలని జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ ముందు నిరసన తెలిపారు జర్నలిస్టులు. టీవీ9 జర్నలిస్ట్ రంజిత్‌పై దాడిని ఖండిస్తూ ఆందోళన నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు టీవీ9 ఉద్యోగులు.
ఈ నిరసనలో పాల్గొన్న టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్.. మోహన్ బాబు ప్రవర్తనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 70 ఏళ్లు పైబడిన వ్యక్తి.. ఇంత జీవితం చూసిన వ్యక్తి నుంచి ఈ ప్రవర్తన ఊహించలేదన్నారు. గతంలో కూడా మంచు ఫ్యామిలీ ఇలా ప్రవర్తించిన దాఖలాలు ఉన్నాయని.. అప్పటిలానే ఇప్పుడు కూడా పశ్చిత్తాపం కనిపించడం లేదన్నారు రజినీకాంత్. మీడియా కెమెరాలు, మైకులు.. ప్రజలు గొంతకను చూపించే, వినిపించే సాధనాలు అని.. వాటినే వినియోగించి జర్నలిస్టులపై దాడి చేయడం దారుణమన్నారు. దాడి సమయంలో మోహన్ బాబు ప్రవర్తనను చూస్తే.. కక్షతో కసితీరా కొట్టినట్లుందన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సీరియస్ యాక్షన్ తీసుకోవాలని టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ డిమాండ్ చేశారు.
Amaravati News Navyandhra First Digital News Portal