విమానం ల్యాండ్ కాగానే.. అనుమానంగా ఇద్దరు వ్యక్తులు.. బ్యాగులు ఓపెన్ చేయగా

యువర్ అటెన్షన్ ప్లీజ్..! 6E1068 విమానం బ్యాంకాక్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చింది. రన్‌వేపై వచ్చిన ఆ విమానంలో నుంచి ప్రయాణీకులు ఒక్కొక్కరిగా కిందకు దిగుతున్నారు. ఇక వారిలో ఇద్దరు కదలికలు తేడాగా కనిపించాయి. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించగా..

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ బాగా రద్దీగా ఉంది. అప్పుడే బ్యాంకాక్ నుంచి ఓ విమానం రన్‌వేపైకి వచ్చింది. ఎగ్జిట్ గుండా ప్రయాణీకులు ఒక్కొక్కరు లోపలికి వస్తున్నారు. ఇక వారిలో ఇద్దరు వ్యక్తులు కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. ఆ ఇద్దరిని పక్కకు పిలిచి చెక్ చేయగా.. దెబ్బకు కస్టమ్స్ అధికారులు షాక్ అయ్యారు.

వివరాల్లోకి వెళ్తే.. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల నుంచి విదేశీ జాతికి చెందిన జంతువులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సతీష్, శరవన్ అనే ఇద్దరు ప్రయాణీకులు సెప్టెంబర్ 8న బ్యాంకాక్ నుంచి 6E1068 విమానంలో శంషాబాద్ చేరుకున్నారు. సదరు ప్రయాణీకుల కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. వారి లగేజిలో 4 గ్రీన్ కిల్డ్ బల్లులు, 10 గర్డిల్ బల్లులను గుర్తించారు. అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరిపై వన్యప్రాణ రక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


About Kadam

Check Also

రేయ్ ఏంట్రా ఇది.. బిర్యానీ తింటుండగా షాకింగ్ సీన్.. ప్లేట్‌లో కనిపించింది చూసి..

హైదరాబాద్‌ నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సెఫ్టీ అధికారులు నిత్యం దాడులు చేస్తున్నా పరిస్థితుల్లో మాత్రం ఏ మాత్రం మార్పు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *