విమాన ప్రమాదంలో మరణించిన మెడికోల కుటుంబాలకు UAE డాక్టర్‌ భారీ విరాళం!

అహ్మదాబాద్‌లోని విమాన ప్రమాదంలో మృతి చెందిన వైద్య విద్యార్థులు, వైద్యుల కుటుంబాలకు యూఏఈకు చెందిన డాక్టర్ షంషీర్ వాయలిల్ 6 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన నలుగురు విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు, గాయపడిన వారికి 20 లక్షల రూపాయలు చొప్పున విరాళం అందించనున్నారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ నెల 12న ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 242 మందితో అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్తున్న విమానం ఎయిర్‌ పోర్ట్‌ నుంచి టేకాఫ్‌ అయిన నిమిషం లోపే ఓ మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ బిల్డింగ్‌పై కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో 241 మంది మృతి చెందగా.. హాస్టల్‌లోని వైద్య విద్యార్థులు, వైద్యులు కూడా మృతి చెందారు. అయితే.. ఈ ప్రమాదంలో మరణించిన, గాయపడిన వైద్యుల కుటుంబాలకు యూఏఈకి చెందిన ఓ వైద్యుడు భారీ విరాళం ప్రకటించారు. డాక్టర్ షంషీర్ వాయలిల్ BJ మెడికల్ కాలేజీలో విమాన ప్రమాద సమయంలో మరణించిన నలుగురు వైద్య విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి చొప్పున అలాగే గాయపడిని వారికి ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.6 కోట్ల భారీ విరాళం ప్రకటించారు.

బుర్జీల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్, VPS హెల్త్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన డాక్టర్ షంషీర్.. ప్రమాద దృశ్యాలు తన మనసును కలచివేశాయని అన్నారు. మంగళూరులోని కస్తూర్బా మెడికల్ కాలేజీ, చెన్నైలోని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజీలో తన వైద్య విద్య సమయంలో ఇలాంటి హాస్టళ్లలో నివసించిన వ్యక్తిగా.. చిత్రాలు తన హృదయాన్ని కలచివేసినట్లు తెలిపారు. ప్రమాదం తర్వాత హాస్టల్ ఫుటేజ్ చూసిన తర్వాత ఇల్లులా భావించే హాస్టల్‌ ప్రదేశాలు, కారిడార్లు, పడకలు, నవ్వులు, పరీక్షల ఒత్తిడి, కుటుంబం నుండి పిలుపు కోసం ఎదురుచూడటం నాకు గుర్తు చేసిందంటూ తన విద్యార్థి దశను గుర్తు తెచ్చుకున్నారు.

అయితే డాక్టర్‌ షంషీర్‌ ఇప్పుడే కాదు 2010 మంగళూరు విమాన ప్రమాద సమయంలో కూడా ఆర్థిక సాయం అందించారు. కాగా అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో మరణించిన వైద్య విద్యార్థుల వివరాలు చూస్తూ.. రాజస్థాన్‌లోని బార్మర్‌కు చెందిన జయప్రకాష్ చౌదరి, రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌కు చెందిన మానవ్ భాదు, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఆర్యన్ రాజ్‌పుత్, గుజరాత్‌లోని భావ్‌నగర్‌కు చెందిన రాకేష్ దియోరా ఉన్నారు.

About Kadam

Check Also

చల్లటి సాయంత్రానికి వేడి వేడి బ్రెడ్ పకోడా.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు..

ఈ బ్రెడ్ పకోడాను రెండు విభిన్న పద్ధతుల్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం: ఒకటి సాధారణ బ్రెడ్ పకోడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *