మరో 2 రోజుల్లోనే యూజీసీ నెట్‌ రాత పరీక్షలు.. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌ లింక్‌

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025 (యూజీసీ- నెట్‌) జూన్‌ సెషన్‌ పరీక్షలు మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఈ క్రమంలో యూజీసీ నెట్‌ అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీయే) తాజాగా విడుదల చేసింది. నెట్‌ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి అడ్మిట్‌ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కాగా జూన్‌ 25 నుంచి 29వ తేదీ వరకు రోజుకు రెండు షిఫ్టుల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో యూజీసీ నెట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నాం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షలు ఆయా తేదీల్లో జరగనున్నాయి. కాగా యేటా జూనియర్‌ రిసెర్చి ఫెలోషిప్‌ అవార్డు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు, పీహెచ్‌డీ ప్రవేశాలకు అర్హత సాధించేందుకు యూజీసీ నెట్‌ పరీక్షలను రెండు సార్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను మొత్తం 85 సబ్జెక్టుల్లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తున్నారు. జూన్‌25 నుంచి ప్రారంభంకానున్న నెట్‌ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులో ఫోటో, సంతకం, క్యూఆర్‌ కోడ్‌ తప్పుగా ఉంటే.. వాటిఇని తిరిగి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఎన్టీయే సూచించింది.

About Kadam

Check Also

ఎన్టీఆర్‌ వర్సిటీ ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. నేటి నుంచి అప్లికేషన్లు ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్, డెంటల్‌ మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కన్వీనర్‌ కోటా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *