ఆధార్ కార్డు వినియోగదారులకు యూఐడీఏఐ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఉచితంగా ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు ఇప్పటి వరకు ఉన్న గడువును మళ్లీ పొడిగించింది. అయితే ఇప్పటి వరకు ఉన్న గడువు నేటితో (జూన్ 14) ముగియనుండగా దానిని మరో సంవత్సరం పాటు పొడగిస్తూ యూఐడీఏఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 2026 జూన్ 14వ వరకు అదార్ ఉచిత అప్‌డేట్ గడువును పొడిగిస్తున్నట్లు యూఐడీఏఐ సంస్థ తన ‘ఎక్స్’ ఖాతా వేదికగా ప్రకటన జారీ చేసింది
ఈ ప్రకటనకు సంబంధించిన ఉత్తర్వులను ఎక్స్ వేధికగా విడుదల చేస్తూ యూఐడీఏఐ సంస్థ ఇలా రాసుకొచ్చింది. ఆధార్‌లో కార్డులో ఉచితంగా వివరాలు నమోదు చేసుకునే గడువును మరో ఏడాది పాటు పెంచుతున్నామని..ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది. తాము తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షలాది మందికి భారతీయులకు ప్రయోజనం చేకూరుస్తుందని యూఐడీఏఐ తెలిపింది.
అయితే ఈ ఉచిత ఆధార్ అప్‌టేడ్ అనేది వినియోగదారులు ఎంతో ఉపయోగపడుతుంది. ఎలా అంటే వివాహం, ఉద్యోగం, ఉన్నత చదువులు అంటూ ఇలా కొందరు వలసలు వెళ్లి జీవనం సాగిస్తూ ఉంటారు. అలాంటి సమాయాల్లో వారి అడ్రస్ వంటి మారుతూ ఉంటాయి. దీంతో ఈ ఆధార్ అప్‌డేట్ అందుబాటులో ఉండడం వల్ల వారు ఎప్పటికప్పుడూ ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకోగులుగుతారు. ఇదిలా ఉండగా ఆధార్ కార్డు పొంది ప్రతి ఒక్కరు పదేళ్లు పూర్తయిన వెంటనే దాన్ని అప్‌డేట్ చేసకోవాలని యూఐడీఏఐ చెబుతోంది.