స్కూల్‌లో పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఉంటే ఎవరు వెళ్తారు.. పిల్లలు చదివే స్కూల్‌కు తల్లిదండ్రులు వెళ్తారు. కానీ ఇక్కడో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాత్రం ఈ పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమం సందర్భంగా తన తల్లిదండ్రులు చదువకున్న స్కూల్‌కు వెళ్లారు. టీచర్స్, పేరెంట్స్ మీటింగ్‌లో పాల్గొని, తర్వాత విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం చెప్పట్టిన మెగా పేరెంట్స్,టీచర్స్ మీటింగ్‌లో భాగంగా గురువారం తమ పిల్లలు చదువుకునే స్కూల్స్‌కి తల్లిదండ్రులు వెళ్తే. కేంద్ర పౌర విమానాయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాత్రం దానికి భిన్నంగా తన తల్లిదండ్రులు చదువకున్నా స్కూల్‌కు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గురువారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో విశేషం ఏంటంటే ఆయన ముఖ్య అతిథిగా వెళ్ళిన స్కూల్స్ లోనే చిన్నతనంలో అతని తండ్రి దివంగత మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు, తల్లి విజయ లక్ష్మి చదువుకున్నారు. మొదట పేరెంట్స్ ,టీచర్ మీటింగ్ భాగంగా తన తండ్రి చదువుకున్న ZP హై స్కూల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడే విద్యార్థులతో కలిసి మధ్యహ్నం భోజనం చేశారు.
అనంతరం శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా జూనియర్ కాలేజిలో జరిగిన పేరెంట్స్, టీచర్ మీటింగ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొనగా. ఇదే కాలేజీలో ఒకప్పుడు తన తల్లి విజయలక్ష్మి చదువుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మంత్రి కొంత భావోద్వేగానికి గురయ్యారు. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళ జూనియర్ కాలేజిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎన్నో వ్యక్తిగత అనుభూతులను పంచుకున్నారు. తన తల్లిదండ్రులు చదువుకున్న విద్యాసంస్థలలో జరిగిన కార్యక్రమాలలో మంత్రి హోదాలో పాల్గొనటం తనకు గొప్ప మెమొరబుల్ డే అని తెలిపారు.
అదే సందర్భంలో స్కూల్ వయస్సులో తాను పడ్డ వ్యక్తిగత ఆవేదనను మంత్రి వ్యక్తపరిచారు. తన చిన్నప్పుడు స్కూల్‌లో జరిగే ఏ పేరెంట్స్ మీటింగ్‌కి తన తండ్రి వచ్చేవారు కాదని.. అప్పట్లో తనకు చాలా బాధ కలిగిందని చిన్ననాటి జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు. తాను చిన్నప్పుడు ఢిల్లీలోనీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకునే వాడినని.. అప్పట్లో వాళ్ల నాన్న మినిస్టర్‌గా, ఎంపీగా ప్రజా జీవితంలో బిజీగా ఉండేవారనీ తెలిపారు. అప్పట్లో తన స్కూల్ లోనూ పేరెంట్స్ మీటింగ్ ఉండేదనీ..అప్పుడప్పుడు అమ్మ మాత్రమే వచ్చేదని ఆయన చెప్పుకొచ్చారు. తోటి స్టూడెంట్స్ అమ్మానాన్నలు వచ్చి టీచర్స్‌తో మాట్లాడేవారనీ చెప్పారు. అది చూసి తన తండ్రి కూడా వచ్చుంటే.. తాను కూడా సంతోషపడేవాడినని ఆయన అన్నారు. ఎన్ని పనులు ఉన్నా ప్రతి తల్లిదండ్రులు, పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌కు వెళ్లాలని మంత్రి సూచించారు. లేదంటే తమ పిల్లల్లో కూడా తనలా బాధ ఉండిపోతుందని వివరించారు. పిల్లలు ఏదైనా సాధించినప్పుడు వచ్చే ఆనందంకి మించిన ఆనందం తల్లిదండ్రులకు మరొకటి ఉండదని తెలిపారు. ఇక తాను పుట్టి పెరిగిన శ్రీకాకుళం జిల్లాను ఎవరైనా వెనుకబడిన జిల్లా అంటే తనకు చాలా కోపం వస్తుందని మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.