ఆల్‌టైమ్‌ రికార్డ్‌ స్థాయికి యూపీఐ చెల్లింపులు.. రూ. లక్షల కోట్ల ట్రాన్సాక్షన్స్‌

దేశంలో యూపీఐ సేవలు ఓ రేంజ్‌లో విస్తరిస్తున్న విషయం తెలిసిదే. టీ కొట్టు మొదలు పెద్ద పెద్ద దుకాణాల వరకు అన్ని యూపీఐ పేమెంట్స్‌ను ఆహ్వానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా యూపీఐ సేవలు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. నవంబర్‌ నెలలో యూపీఐ ట్రాన్సాక్షన్స్‌ ఏకంగా 15.48 బిలియన్లకు చేరుకోవడం విశేషం. ఇది 38 శాతం వృద్ధితో సమానం. ఈ లావాదేవీల మొత్తం విలువ ఏకంగా రూ.21.55 లక్షలు కావడం గమనార్హం. ఈ విషయాలను నేషనల్ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆదివారం విడుదల చేసిన డేటాలో తెలిపింది.

కాగా అక్టోబర్‌ నెలలో ఏకంగా రూ. 23.5 లక్షల కోట్ల విలువైన 16.58 బిలియన్ లావాదేవీలు జరిగాయి. 2016లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత నుంచి అత్యధిక లావాదేవీలు ఇదే. రోజువారీ లావాదేవీల సంఖ్య నవంబర్‌లో 516 మిలియన్లుగా ఉంది. వీటి విలువ రూ. 71,840 కోట్లుగా ఉంది. ఎన్‌పీసీఐ డేటా ప్రకారం.. నవంబర్‌లో ఐఎమ్‌పీఎస్‌ లావాదేవీలు 408 మిలియన్లు జరగగా వీటి విలువ రూ. 5.58 లక్షల కోట్లుగా ఉంది.

ఇక ఫాస్ట్‌ట్యాగ్‌ లావాదేవీల విషయానికొస్తే.. అక్టోబర్‌లో 345 మిలియన్లుగా ఉండగా.. నవంబర్‌ నాటికి ఈ సంఖ్య 4 శాతం పెరిగి 359 మిలియన్లకు పెరిగిది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ లావాదేవీలు 92 మిలియన్లుగా నమోదయ్యాయి. వీటి విలవు రూ.23,844 కోట్లుగా ఉంది.

యూపీఐ సేవల గురించి ఆర్థిక మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ.. బహుళ బ్యాంకింగ్ సేవలను ఒకే యాప్‌లో ఏకీకృతం చేయగల సామర్థ్యం ఆర్థిక సాంకేతికలో ఒక గేమ్‌ ఛేంజర్‌గా అభివర్ణించింది. యూపీఐ సేవలు ప్రజలకు సౌలభ్యం, భద్రతతో కూడిన డిజిటల్‌ చెల్లింపులను అందించిందని తెలిపింది. సమయంతో సంబంధం లేకుండా బ్యాంకింగ్ లావాదేవీలు జరగడం ప్రజలకు ఎంతో మేలు చేకూర్చిందని అధికారులు చెబుతున్నారు.

ఇక యూపీఐతో రూపే క్రెడిట్‌ కార్డులను అనుసంధానించడం డిజిటల్‌ చెల్లింపుల్లో ఒక విప్తవాత్మక మార్పుగా చెప్పొచ్చు. ఈ ఫీచర్‌ సహాయంతో వినియోగదారులు తమ క్రెడిట్‌ కార్డుతో యూపీఐ ద్వారా పేమెంట్స్‌ చేసుకోవచ్చు. దీంతో చిన్ని చిన్న పేమెంట్స్‌కు కూడా క్రెడిట్‌ కార్డును వినియోగించుకోవచ్చు.

About Kadam

Check Also

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫఢ్నవీస్‌.. ఏక్‌నాథ్‌షిండే, అజిత్‌పవార్‌కు కీలక పదవులు..?

మహారాష్ట్ర కొత్త సీఎం క్లారిటీ వచ్చేసింది. కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. భారతీయ జనతా పార్టీ కోర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *