యూపీఎస్సీ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ 2025 నోటిఫికేషన్‌.. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం

ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (IES), ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ISS) ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. యూపీఎస్సీ భర్తీ చేసే ఈ పోస్టులకు పోటీ ఎంత పెద్ద ఎత్తున ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యేటా వేలాది మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (IES), ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ISS) ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 4, 2025వ తేదీ సాయంత్రం 6 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఏడాదికి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (IES)లో 12 పోస్టులు, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ISS)లో 35 పోస్టులు.. మొత్తం 47 పోస్టులను యూపీఎస్సీ భర్తీ చేయనుంది.

ఎకనామిక్ సర్వీస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్ లేదా ఎకనామెట్రిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే స్టాటిస్టికల్ సర్వీస్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ అప్లైడ్ స్టాటిస్టిక్స్‌ విభాగంలో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి ఆగస్టు 01, 2025 నాటికి తప్పనిసరిగా 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ అర్హలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపుల నుంచి మినహాయింపు ఉంటుంది. ఇక తుది గడువు ముగిసిన 7 రోజుల్లోపు అంటే మార్చి 5 నుంచి 11, 2025వ తేదీ వరకు అప్లికేషన్‌ ఎడిట్‌ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. అలాగే దరఖాస్తులను ఉపసంహరించుకోవడానికి కూడా ఈ ఏడు రోజుల్లోనే అవకాశం ఉంటుంది.

రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రశ్నాపత్రం ఆబ్జెక్టివ్-టైప్ విధానంలో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానికి నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. యూపీఎస్సీ- ఐఈఎస్‌/ ఐఎస్‌ఎస్‌ఈ 2025 పరీక్ష జూన్‌ 20, 2025వ తేదీన నిర్వహిస్తారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

About Kadam

Check Also

‘ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశానం’.. RSS చీఫ్ భగవత్ సామాజిక ఐక్యతా మంత్రం

అలీఘర్‌లో ఐదు రోజుల పర్యటనలో ఉన్న RSS చీఫ్ మోహన్ భగవత్ వరుస సమావేశాల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన ఓ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *