ఎలాంటి రాత పరీక్షలేకుండానే.. యూపీఎస్సీలో లెక్చర్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఉద్యోగాలు!

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, లెక్చరర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 84 పోస్టులను భర్తీ చేయనుంది.

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ).. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, లెక్చరర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 84 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో లెక్చరర్‌ పోస్టులకు వృక్షశాస్త్రం, రసాయన శాస్త్రం, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, గృహ శాస్త్రం, భౌతిక శాస్త్రం, మనస్తత్వశాస్త్రం, సామాజిక శాస్త్రం, జంతుశాస్త్రం సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయి. ఇక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్ధులు సెంట్రల్‌ బ్యూర్‌ ఆఫ్‌ ఇన్వేస్టిగేషన్‌ (CBI)లో పని చేయవల్సి ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 11, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వివరాలు ఇవే..

  • అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టుల సంఖ్య: 19
  • పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టుల సంఖ్య: 25
  • లెక్చరర్‌ పోస్టుల సంఖ్య: 40

సంబంధి పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈడీ, ఎల్‌ఎల్‌బీ, ఎంఏ, ఎంఎస్సీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత విభాగంలో పని అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితి 45 ఏళ్లుగా నిర్ణయించారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 11, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్షలేకుండానే ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు లెక్చరర్‌ పోస్టులకు రూ.52,700 నుంచి రూ.1,66,700 వరకు జీతంగా చెల్లిస్తారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టులకు నెలకు రూ.56,100 నుంచి 1,77,500 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇక అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టులకు నెలకు రూ.44,900 నుంచి 1,42,400 వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

About Kadam

Check Also

ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఉద్యోగ నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్ష లేదు

రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డాక్టర్‌ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *