ఈ సంవత్సరం అరకు కాఫీలో అరుదైన అలాంటి అరకు కాఫీ గింజలతో ఇప్పుడు విజయనగరం జిల్లాకేంద్రంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు పలువురు యువకులు. తోటపాలెం షిర్డీసాయి కాలనీలో ఏర్పాటు చేసిన అరకు కాఫీ గింజల వినాయకుడు భక్తులందరినీ ఆకట్టుకుంటున్నాడు. ప్రకృతి సిద్ధమైన వినాయకుణ్ణి ఏర్పాటుచేయాలని నిర్వాహకులు మట్టితో చేసిన గణపతికి ఒక్కొక్క కాఫీ గింజను అద్దుతూ కళాత్మక రూపాన్ని తీసుకొచ్చారు.
అరకు కాఫీ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. అవకాశం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా అరకు కాఫీని ప్రమోట్ చేస్తూ అందరి చూపును అరకు కాఫీ వైపు తిప్పుతున్నారు. గత కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ప్రధాని మోదీ సైతం అరకు కాఫీ ప్రత్యేకతను తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం అరకు కాఫీలో అరుదైన అలాంటి అరకు కాఫీ గింజలతో ఇప్పుడు విజయనగరం జిల్లాకేంద్రంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు పలువురు యువకులు. తోటపాలెం షిర్డీసాయి కాలనీలో ఏర్పాటు చేసిన అరకు కాఫీ గింజల వినాయకుడు భక్తులందరినీ ఆకట్టుకుంటున్నాడు. ప్రకృతి సిద్ధమైన వినాయకుణ్ణి ఏర్పాటుచేయాలని నిర్వాహకులు మట్టితో చేసిన గణపతికి ఒక్కొక్క కాఫీ గింజను అద్దుతూ కళాత్మక రూపాన్ని తీసుకొచ్చారు. ఈ విగ్రహ ఏర్పాటుకు సుమారు నెల రోజుల పాటు యువకులు నిరంతరం శ్రమించారు.
మట్టివినాయకుడికి కాపీగింజలతో అద్దిన ఈ విగ్రహం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సుమారు వంద కేజీల వరకు ఈ వినాయకుని విగ్రహానికి అమర్చారు. అరకు కాఫీ గింజలు వినాయకుడి శరీరానికి నిండుగా అద్దడం వలన ప్రత్యేకమైన ఆకర్షణీయ రూపం వచ్చింది. గతంలో నెమలి పింఛాలతో గణపయ్యను ప్రతిష్టించిన నిర్వాహకులు, ఈసారి కొత్త ఆలోచనతో ముందుకు వచ్చి కాఫీ గింజల వినాయకుణ్ణి తీర్చిదిద్దారు.