రోహిత్ బాటలోనే విరాట్.. టెస్టులకు గుడ్ బై

రోహిత్‌ శర్మ బాటలోనే టెస్టు క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు స్టార్ క్రికెటర్ కోహ్లి. ఇంగ్లాండ్‌ పర్యటనకు తనను ఎంపిక చేయొద్దని బీసీసీఐకి ముందుగానే సమాచారమిచ్చిన కోహ్లి తాజాగా తన రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించాడు. ఈ సమయంలో రిటైర్మెంట్ వద్దని బీసీసీఐ వారించినప్పటికీ.. కోహ్లి పట్టించుకోలేదని తెలుస్తోంది.

బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఇంగ్లండ్ టూర్‌కు ముందు టెస్టులకు కింగ్ కోహ్లి రిటైర్మెంట్ ప్రకటించాడు. 14 ఏళ్ల టెస్టు కెరీర్ తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నాడు. టెస్ట్ క్రికెట్‌లో భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన నాల్గవ ఆటగాడిగా కోహ్లీ రిటైర్ అయ్యాడు. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్ తర్వాత టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసింది కోహ్లినే. 2011లో భారతదేశం వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగమైన రెండు నెలల తర్వాత, అతను జమైకాలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తన టెస్ట్ అరంగేట్రం చేశాడు.

2025 జనవరిలో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నూతన సంవత్సర టెస్ట్ సందర్భంగా అతను ఈ ఫార్మాట్‌లో చివరిసారిగా కనిపించాడు. 123 టెస్టుల్లో కోహ్లీ 46.85 సగటుతో 9,230 పరుగులు సాధించాడు. వాటిలో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యధిక స్కోరు –  254 నాటౌట్.  2019లో దక్షిణాఫ్రికాతో పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఈ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.

‘‘14 ఏళ్ల క్రితం మొదటిసారి టెస్టు క్రికెట్‌ జెర్సీ ధరించా. ఈ ఫార్మాట్‌ నన్ను ఇంత ముందకు నడిపిస్తుందని ఊహించలేదు. ఇది నాకు పరీక్షలు పెట్టి.. మంచి ప్లేయర్‌గా తీర్చిదిద్దింది. జీవితానికి సరిపడినన్ని లెసన్స్ నేర్పించింది. వైట్ జెర్సీలో ఆడటం నా మనసుకు ఎప్పుడూ ప్రత్యేకమే. నిశ్శబ్దమైన ఆనందం.. సుదీర్ఘమైన రోజులు.. ఎవరికీ కన్పించని చిన్న చిన్న క్షణాలు నాతో ఎప్పటికీ ఉంటాయి. అలాంటి ఈ ఫార్మాట్‌‌ను వదిలేయడం మాములు విషయం కాదు. అయినే ఈ నిర్ణయం మంచిదిగానే అనిపిస్తుంది. టెస్ట్ క్రికెట్‌కు ఎంతో ఇచ్చా. నేను ఆశించిన దాని కంటే ఎక్కువే అది నాకు రిటన్స్ ఇచ్చింది. మనసు నిండా సంతృప్తితో, కృతజ్ఞతాభావంతో దీన్ని నుంచి తప్పుకుంటున్నా. వెనక్కి తిరిగి నా టెస్టు కెరీర్‌ను చూసుకుంటే నా ముఖంలో చిరునవ్వు ఉంటుంది. ప్రేమతో ఇక సైనింగ్‌ ఆఫ్‌..’’ అని కోహ్లీ తన సోషల్ మీడియాలో భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు.

About Kadam

Check Also

 రోజు రాత్రి నిద్రకు ముందు రెండు వెల్లుల్లి రెబ్బలు తిన్నారంటే..

వర్షా కాలంలో ఆరోగ్య సమస్యలను నివారించడానికి మనం ముందుగానే సిద్ధంగా ఉండాలి. లేదంటే ఆస్పత్రుల చుట్టూ తిరగవల్సి ఉంటుంది. ఇలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *