గుడ్‌న్యూస్.. ఏపీకి రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు.? ఏ రూట్‌లోనంటే.!

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పలు రూట్లలో వందేభారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఇక ఇప్పుడు ఏపీకి మరో రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు రానున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉండగా.. అవి ఏయే రూట్లలో ఇప్పుడు తెలుసుకుందామా..

ఏపీ ప్రజలకు త్వరలోనే గుడ్‌న్యూస్ అందనుంది. రాష్ట్రంలో మరో రెండు వందేభారత్ రైళ్లు పట్టాలెక్కే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ప్రయాణీకుల రద్దీ పెరుగుతుండటంతో ఇప్పటికే పలు రూట్లలో కొత్త వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని పలువురు ఎంపీలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఇక వాటిల్లో కొన్నింటికి కేంద్రం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. విశాఖపట్నం నుంచి బెంగళూరు, తిరుపతికి వందేభారత్ రైళ్లు నడపాలని విశాఖ ఎంపీ రైల్వే అధికారులను కోరారు.

దీనికి అనుగుణంగా ఆయా రూట్లకు వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్లాన్ చేస్తున్నారని చర్చ జరుగుతోంది. అయితే దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉండగా.. అధికారిక ప్రకటన వచ్చేందుకు మరికొంత సమయం పట్టేలా ఉంది. ఇక ప్రస్తుతం విశాఖపట్నం నుంచి నాలుగు వందేభారత్‌ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు రెండు.. భువనేశ్వర్, దుర్గ్‌కు చెరొకటి నడుస్తున్నాయి.

మరోవైపు ఏపీకి మరికొద్దిరోజుల్లో కొత్త వందేభారత్ వచ్చే అవకాశం ఉంది. ఈ ట్రైన్ విజయవాడ-బెంగళూరు మధ్య నడుస్తుందని టాక్. గుంటూరు, పల్నాడు, రాయలసీమ మీదుగా ఈ వందేభారత్ నడవనుందట. అటు సికింద్రాబాద్ నుంచి తిరుపతి, బెంగళూరు, నాగ్‌పూర్ రూట్లలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు తిరుగుతున్నాయ్.

About Kadam

Check Also

రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన మృత్యువు.. టిప్పర్ ఢీకొని ఏడుగురు దుర్మరణం

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారును టిప్పర్‌ ఢీకొట్టిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *